పరకాల నేటిధాత్రి
పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన దరావత్ ధన్ సింగ్ అనే వ్యక్తిని పీడీయాక్ట్ క్రింద అరెస్ట్ చేసి కలెక్టర్ ఆదేశాలమేరకు చర్లపల్లి సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.ధన్ సింగ్ ఫై ఇప్పటివరకు 6కేసులు అతడి బార్య ఫై 4 గుడుంబా కేసులు నమోదైన్నందున హెచ్చరించినప్పటికి మానుకోకుండా వ్యాపారం కొనసాగిస్తూ ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యేందుకు కారణం అవుతున్నందున వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు,జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ల ఆదేశాల మేరకు సదరుj వ్యక్తి పై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది.గుడుంబాను నిర్ములించడంలో భాగంగా పెద్దఎత్తున గుడుంబా తయారీ,రవాణా,అమ్మకాలు చేస్తున్న వ్యక్తులు గుడుంబా వ్యాపారం మానుకోనట్లయితే వారందరి ఫై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఎం.మురళీధర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్,పి.తాతాజీ సీఐ,ఎస్ఐ జ్యోతి,కానిస్టేబుల్ లు పి.సత్తయ్య,అఖిల్,విజయకుమార్ లు పాల్గొన్నారు.