జమ్మికుంట: నేటి ధాత్రి
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు స్థానిక వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులచే పదివేల సీడ్ బాల్స్ తయారు చేసి చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు రామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ అడవుల పెంపకానికి ఉద్దేశించి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారుచేసి అక్టోబర్ 2న ఫారెస్ట్ ఏరియాలో వెదజల్లుతామని తెలిపారు. దేశంలో చెట్లను నాటడం కన్నా అడవుల నరికివేత అధికంగా ఉన్నందున ప్రతి పౌరుడు బాధ్యత గా వ్యవహరించి చెట్లను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లంకి రమేష్, చందా రవీందర్,మహిళా అధ్యక్షురాలు అయిత స్వాతి, రామిడి విజయలక్ష్మి, నవ్య మరియు కళాశాల ప్రిన్సిపల్ కె. రాజిరెడ్డి , అధ్యాపక బృందం పాల్గొన్నారు.