సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట: నేటిధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆపదలో అండగా ఉంటూ చేయూతనందిస్తానని
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఅన్నారు.జమ్మికుంట పట్టణం లోని 30 వార్డులలో జమ్మికుంట మండలంలో జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, మాచనపల్లి, జమ్మికుంట పట్టణం, మడిపల్లి, శాయంపేట, నాగంపేట, తనుగుల, పాపక్కపల్లి, వావిలాల, నగురం, విలాసాగర్, బిజ్జిగిరి షరీఫ్, కోరపల్లి గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోరాటానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. జమ్మికుంట అర్బన్, జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.జమ్మికుంట టౌన్ లో 43 చెక్కులు మొత్తం 12,26,500/- రూపాయల చెక్కులను, జమ్మికుంట రూరల్లో 45 చెక్కులు
మొత్తం 10,75,000/- రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యశ్రీ పథకం కింద అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మెరుగైన సేవలు అందించేలా నేను పని చేస్తా అని పేర్కొన్నారు.పాడి కౌశిక్ రెడ్డి వర్షంలోనూ చెక్కులు పంపిణీ చేస్తూ ప్రజల నుండి విశేష అభినందనలుఅందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అన్ని వేళలలో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా
