జర్నలిస్టులు సభ్యత్వం నమోదుచేసుకోవాలి

ఐజేయు జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి సతీష్ శ్యామ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు టి.యు.డబ్ల్యూ.జే (ఐజేయు) సభ్యత్వాన్ని తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్, కార్యదర్శి సామంతుల శ్యామ్ తెలిపారు .
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉన్న జర్నలిస్టులు సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అన్ని మండలాల్లో కూడా మండలానికి ఒక ఇన్ చార్జి ని నియమించి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలను ఇప్పించడం కోసం టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్అలీ,కార్యదర్శి రామ్ నారాయణ లు ఎంతో కృషి చేసి తెలంగాణ మీడియా అకాడమీ చేర్మేన్ కే .శ్రీనివాసరెడ్డి గారి ద్వారా జర్నలిస్ట్ లకు అతి త్వరలో హైదరాబాదులో జరిగే జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా తీపి వార్తని అందించబోతున్నారని తెలిపారు.
అంతేకాకుండా జర్నలిస్టులకు అక్రిడేషన్ తోపాటు పని చేసే హెల్త్ కార్డలను ఇవ్వబోతున్నారని తెలిపారు.
దిగజారిన మీడియా విలువలను కాపాడటం కోసం ఒక ప్రణాళికను సిద్దం చేసి ,జర్నలిజానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం టి.యు.డబ్ల్యూ.జే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గంతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కావున అతి త్వరలో హైదరాబాదులో జరిగే జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు హాజరుకావాలని, నిరంతరం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతూ జర్నలిజానికి పూర్వ వైభవం తీసుకురాబోతున్న టీయూడబ్ల్యూజే(ఐజేయు)లో జిల్లాలో పనిచేస్తున్న ఎక్కువ మంది జర్నలిస్టులు సభ్యత్వం తీసుకోని యూనియన్ అభివృద్ధి కి సహకరించాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్యాతం సతీష్ కుమార్ సామంతుల శ్యామ్ లు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కుమార్ యాదవ్, రాష్ట్ర హెల్త్ కమిటీ మెంబర్ సామల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయ్, టెమ్జూ అధ్యక్షులు సాంబయ్య, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!