రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో దేవాలయ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈసమావేశానికి గ్రామ ప్రజలు, పెద్దలు హాజరై ఉత్సవ కమిటీ చైర్మన్ గా మడ్డి అంజయ్య, వైస్ చైర్మన్ లుగా మ్యాకల నాగరాజు, పొన్నం శ్రీనివాస్, మిగతా కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా ఉత్సవాలను నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈసందర్భంగా నూతన ఉత్సవ కమిటీని మాజీ ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్ గౌడ్ సన్మానించి అభినందించడం జరిగినది. ఈసమావేశంలో మాజీ సర్పంచ్ పొన్నం తిరుపతి గౌడ్, బండారి చంటయ్య, మడ్డి రవీందర్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.