ఓదెల డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లో గతంలో నిర్మించిన 49 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మరియు నూతనంగా నిర్మించిన 96 డబల్ బెడ్ రూమ్ లను సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు.అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ లకు మౌలిక వసతులు సిసి రోడ్డు త్రాగునీరు డ్రైనేజీ పవర్ సప్లై సెప్టిక్ ట్యాంక్స్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొలనూరు గ్రామంలో రోడ్ వైండింగ్ పనులను పర్యవేక్షించారు. అదేవిధంగా ఓదెల గ్రామంలో రోడ్ వైండింగ్ పన పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి అదే విధంగా నూతన రోడ్లు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు తీసుకువచ్చి ప్రతి నిరుపేదలకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అది రేవంత్ రెడ్డి కళ అని అన్నారు.మోడల్ స్కూల్ నుండి కేనాలి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయాలని పలువురి కోరిక మేరకు తప్పకుండా సిసి రోడ్డు నిర్మాణం పనులను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దు అని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందించే విధంగా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ప్రత్యేక అధికారి షబ్బీర్ ఎంపీఓ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, చీకట్ల మొండయ్య, చింతం కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్, బోడకుంట చిన్న స్వామి, బైరి రవి గౌడ్, తీర్దాల రామన్న, సంతోష్ లతోపాటు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!