ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తున్న ఆసియా భవిష్యత్తులో మరిన్ని పథకాలతో మంచి పేరు సంపాదించుకోవాలని అన్నారు. మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న సంఘటనలకు తనకు తాను రక్షించుకునే విధంగా సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రత్యేకంగా ఆసియా శిక్షణ తీసుకుంటున్న BMR మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ మాస్టర్ బండారి సంతోష్ ను అభినందించారు. బెంగళూరు లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024… వరంగల్ సత్తా చాటిన ఆసియా ఈనెల 24 & 25 తేదీలలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివ మొగ్గ జిల్లాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో TMRS (JC) లో ఇంటర్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఎండి ఆసియా వ్యక్తిగత కట విభాగంలో బంగారు పతకం అండర్ 16 స్పారింగ్ లో కాంస్య పథకం సాధించింది . బెంగళూరులో ఆరు దేశాలు పాల్గొన్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పథకాలు సాధించిన ఆసియానుTMRS కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది మరియుBMR కరాటే అకాడమీ మాస్టర్ కర్ర వెంకటేష్ . సుప్రియ రణదీప్.వైష్ణవి.. దినేష్ …గణేష్ పలువురు అభినందన తెలిపారు.
ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో (బంగారు & కాంస్య )పథకాలు సాధించిన ఆసియాను ఘనంగా సన్మానించిన ఎంపీ కడియం కావ్య
