సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

* మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్….

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుదవారం వారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు.
గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజ్ మాట్లాడుతూ గుంతల లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా,
చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇండ్లల్లో నీటి నిలువలు లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకోవలాన్నారు.
ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
వారానికి ఒక సారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలనీ, ఇండ్ల లో వాడే కూలర్స్, ఫ్రీజ్, ఏ సీ లలో నీరు నిల్వ లేకుండా ఎపటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటివల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల
అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగీ ,టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు.
వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణవేణి , అగ్రికల్చర్ ఏ ఓ శ్వేతకుమారి, మాజీ ఎంపిటిసి రూప్లా నాయక్ , అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!