జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,లయన్స్ క్లబ్ఆఫ్ గోల్డెన్ జూబ్లీ, విజన్ కేర్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మదేకర్ ఉదారకంటి ఆసుపత్రి రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో సోమవారం రోజున జైపూర్ మండల కేంద్ర స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జి .సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన శిభిరానికి వివిధ గ్రామాల నుండి 150 మంది వచ్చేసి తమ పేరును నమోదు చేసుకొని, బి పి, షుగర్, కంటి పరీక్షలు చేయించుకున్న అనంతరం 50 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించనట్లు నిర్వాహకులు తెలిపారన్నారు.నిబంధన ప్రకారం ఈ రోజు 36 మందిని కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి, రేకుర్తి బస్సు ద్వారా పంపనున్నట్లు వివరించారు. నేత్ర చికిత్స కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం ,వారి వెంట వెళ్లే సహాయక వ్యక్తులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజనం వసతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. సత్యనారాయణ గౌడ్, డిస్టిక్ క్యాబినెట్ సెక్రెటరీ లయన్ శ్రీనివాసరావు, ఐ క్యాంపు చైర్మన్ డా.సుగుణాకర్ రెడ్డి, ఐ క్యాంపు కో- చైర్మన్ లయన్ ఎం. వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు లయన్ పుల్లూరి బలమోహన్, రీజియన్ చైర్ పర్సన్ లయన్ రాజమౌళి, కోశాధికారి లయన్ వెంకటేశ్వర్, లయన్ డా.అభిషేక్, లయన్ డా.రాకెష్ రెడ్డి, లయన్ డా.సయ్యద్ ఇలియాజ్,ఈ జోన్ చైర్ పర్సన్ లయన్ ఏ. శ్రీనివాస్, సెక్రెటరీ ఉదయ్, చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ లింగస్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.