మీ కంటే ‘‘రాబంధులు నయం’’!

https://epaper.netidhatri.com/view/297/netidhathri-e-paper-19th-june-2024%09

-దొంగలు తప్పించుకు తిరుగుతున్నారు!

-నిజాయితీ పరులైతే ఎందుకు దాక్కుంటున్నారు.

-తప్పు చేయకపోతే నిరూపించుకోవచ్చు.

-కార్మికుల కష్టం దోచుకోకపోతే దర్జాగా చెప్పేయొచ్చు.

-లెక్కలు తారుమారు చేసి, కోట్లకు కోట్లు తిన్నారు.

-అసలైన కార్మికులకు అన్యాయం చేశారు.

-నిబంధనలు అతిక్రమించి ఫ్లాట్లు అమ్ముకున్నారు.

-కార్మికులను ఉద్దరిస్తున్నట్లు ఫోజులు కొట్టారు.

-ఆఖరుకు కార్మికుల కొంపలు ముంచారు.

-దర్జా వెలగబెట్టుకునేందు కార్మికుల కష్టమే దొరికిందా!

-కార్మికుల చెమట మీదనే బతకాలనిపించిందా!

-తప్పించుకొని తిరగడం గొప్ప కాదు.

-చేసిన తప్పుకు ఎన్నటికైనా శిక్ష తప్పదు.

-నీతులు చెప్పినట్లే గోతులు తీసిన వాళ్లు పెద్ద మనుషులు కాలేరు.

-మేం గొప్ప వాళ్లని చెప్పుకునే అర్హత అసలే లేదు.

-సాయం చేసిన చదలవాడనూ ఇరికించారు.

-రుణమిచ్చిన బ్యాంకునే ముంచేశారు.

-కార్మికుల సొమ్ము ఎప్పుడో దిగమింగారు.

-ఇంకా ఎంగిలి మెతుకుల ఆకలి తీరలేదా! మీ దన దాహం తీరదా!!

సినీ మోజులో, రంగుల ప్రపంచం కలల్లో తేలిపోవాలని, వెండి తెరమీద వెలిగిపోవాలని నిత్యం ఎంతో మంది హైదరాబాద్‌ చేరుకుంటారు. సినిమా అనేది ఓ మాయ అని తెలియదు. సినీ వినీలాకాశంలో అరమకరికలు తెలియని అమాయకులు ఎంతో మంది నిత్యం మోసపోతుంటారు. అసలు సినీ గతిని అర్ధం చేసుకోకుండా, ఆ ప్రపంచం ఒక మాయాలోకమని తెలియక వస్తుంటారు. తమకు వున్న కళానైపుణ్యాలను ప్రదర్శించాలని కోటి కలలు కంటుంటారు. ఒకప్పుడు మద్రాసు చేరేవారు. ఇప్పుడు హైదరాబాద్‌ వస్తుంటారు. అభంశుభం తెలియని వాళ్లంతా సినీ తరమంతా మచ్చలేని వాళ్లని, కల్మషం లేని వాళ్లని అనుకుంటారు. సినిమాలో చూపించేదంతా నిజమనుకుంటారు. సినీ కథల్లో కనిపించే ఆదర్శం వారి జీవితాల్లో వుంటుదనుకుంటారు. అలా కళలను నమ్ముకొని, వెండి తెరను ఏలుతున్న కళాకారులను నమ్ముకొని వచ్చి జీవితాలు ఆగం చేసుకుంటారు. అలాంటి వారిని ఆదరించినట్లు నమ్మించి మోసం చేసేవాళ్ల కోకొల్లలు వుంటారు. వాళ్లంతా పైకి ఎంతో పెద్ద మనుషులుగా కనిపిస్తారు. కాని వాళ్లే కార్మికుల కష్టం దోచుకుంటారు. వారి రక్తాన్ని జగలుగా మారి పీల్చికుంటారు. సినిమా రంగంలో సినిమాకు అవసరమైన అన్ని రంగాలలో ఎంతో మంది కార్మికులు వుంటారు. ఒక్కసారైనా తెరమీద కనిపించాలనునేవారు కొందరు. జీవితంలో ఒక్క సినిమాకైనా పనిచేయాలనుకునేవారు కొందరు. సినిమా అన్న లోకంలో ఏపనిచేసినా ఫరవాలేదు అనుకునేవారు కొందరు. ఇలా ఇరవై నాలుగు క్రాప్టుల్లో నిత్యం వేలాది మంది పనిచేస్తుంటారు. అందులో చాల మంది వెట్టిచాకిరి చేస్తుంటారు. ఒక్క ఛాన్స్‌ అనుకుంటూ జీవితమంతా ఛాన్సులు లేకుండా పోయేవాళ్లు చాలా మంది వుంటారు. అలా సినిమాను నమ్ముకొని జీవితమంతా ఎదురుచూసేవారిలో కొందరు అప్పుడప్పుడూ అక్కడ దొరికే పనిని కూడా దైవంగా భావించి పని చేసేవాళ్లుంటారు. వారిని కూడా అటు సినీ వర్గాలు ముంచేస్తూనే వుంటాయి. శ్రమను దోచుకుంటూనే వుంటాయి. మరో పక్క వారు చేసిన కష్టాన్ని దోచుకునేవారు కూడా కాచుకొని కూర్చుంటారు. ఆఖరుకు నిలువు దోపిడీ చేసేవారు కూడా వుంటారు. అలాంటి దోపిడీకి చేసిన వాళ్లు అక్కడే వెలిగిపోతుంటారు. దోపిడీకి గురైన వారు కొడిగట్టిన దీపంలా అక్కడే మిణుగురు పురుగుల్లా తిరుగుతుంటారు. అలాంటి వారిని మోసం చేసిన రాబంధులు అక్కడే తిరుగుతుంటారు. అలా దోపిడీ గురై జీవిత కాలం సొంత ఇంటి కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసే వారు చూస్తూనే వున్నారు. ఆశతోనే బతుకుతున్నారు. వాళ్ల ముందే అసలు సినిమాకు సంబంధం లేని వాళ్లెంతో మంది చిత్రపురిలో నివాసముంటున్నారు. ఇదెలా సాధ్యం? అని సామాన్యులకు అర్ధంకాని మాయా ప్రపంచం అక్కడే వుంది. మహానగరంలో మాయగాళ్లు అక్కడే వున్నారు. పెద్ద మనుషులుగా ఇప్పటికీ చెలామణి అవుతూనేవున్నారు. సుద్దపూసులుగా తమను తాము సెల్ఫ్‌ డబ్బాలు కొట్టుకుంటారు. కార్మికుల చెమటను జుర్రేస్తుంటారు. చిత్రపురిలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ దశాబ్దాల తరబడి దోచుకుతింటున్నారు. సొసైటీ పేరుతో కార్మికుల సొమ్మంతా దిగమింగేస్తున్నారు. పట్టించున్నవారు లేరు. పాలకులకు పట్టదు. అడిగిన వారికి మాటకు విలువండదు. ఎవరూ తోడు రారు. ఆదిరించేవారు కరువు. సినీ పెద్దల దాకా చేరదు. పెద్దల ముసుగేసుకున్నవారే దోచుకుంటుంటే పట్టించుకునేందుకు ఎవరికీ ధైర్యం చాలదు. ఇలాంటి పరిస్ధితుల్లో సగటు కార్మికుని వేధన అరణ్య రోధన కాకుండా ఎలా వుంటుంది.

మాద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చినప్పుడు హీరోలు, నటులు, పెద్ద పెద్ద టెక్నీషియన్లకు ఎలాంటి ఇబ్బంది లేదు.

వారికి సంపాదన ఎక్కువే. అన్ని రకాల సౌకర్యాలు వుండేవే. ఎటొచ్చి సగటు కార్మికుడు అనేక ఇబ్బందులు పడుతుంటాడు. ఇది చూసి చలించిన ఒకప్పటి నటుడు ప్రభాకర్‌రెడ్డి కార్మికులకు గూడు కల్పిస్తే సినీరంగం హైదరాబాద్‌లో స్ధిరపడుతుందని ఆలోచించాడు. చొరవ తీసుకొని అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ప్రభుత్వం ముందుకొచ్చి 63 ఎకరాలు కేటాయింది. దాంతో సినీ వర్కర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేశారు. సహజంగా సొసైటీలో 4800 వరకు సభ్యులుండాలన్నది నిబంధన. ఇలా చిత్రపురికి శ్రీకారం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్ధలం మీద కొందరు పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు దాదాపు పదేళ్లపాటు సాగింది. ఆ తర్వాత కార్మికుల పక్షాన తీర్పు వచ్చింది. కాని కార్మికుల జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడిరది. పదేళ్లపాటు కొట్లాడిన కార్మికులకు వరం కావాల్సిన చిత్రపురి, కొంత మంది గద్దలకు ఏటిఎంగా మారిపోయింది. ఇక అప్పటి ఆవు నుంచి పాలుపితికినట్లు సొమ్ముచేసుకుంటూనే వున్నారు. ఒట్టిపోయిన ఆవును మార్చినట్లు మార్చేశారు. ఇప్పుడు అక్కడ కార్మికుడికి స్ధానం లేదు. ఇప్పుడు కొనుక్కొవాలంటే కార్మికుడికి స్ధోమత సరిపోదు. ఆ స్ధలాల కోసం కొట్లాడిన వారికి ఆక్కడ జాగ లేదు. ఇలా మార్చిందెవరు? ఇంత దుర్మార్గం చేసిందెవరు? చిత్రపురిని ఆదాయం మార్గం చేసుకున్నదెవరు? అన్న ప్రశ్నలకు అందరికీ సమాధనం తెలుసు. కాని ఎవరూ మాట్లాడలేదు. కాని ప్రభుత్వం స్పందించింది. న్యాయ వ్యవస్థ కరుణించింది. దాంతో చట్టం ముందుకొచ్చింది. ఓ ఇరవై ఒక్క మంది మీద కేసులు నమోదు చేసింది. ఇంతకాలం కార్మికుల కష్టం రాబంధుల్లా దోచుకుతిన్న వారి పేర్లు బైటకు వచ్చాయి. వారిలో సొసైటీ చైర్మన్‌ను అరెస్టు చేశారు. కాని మిగతా వాళ్లు మాత్రం అరెస్టు కావడం లేదు. కారణం పోలీసులు చెప్పే సమాధానం వాళ్ల ఆచూకీ తెలియడం లేదు? ఇదెక్కడి విడ్డూరం. వాళ్లంతా ప్రజల్లోనే వున్నారు. పలుకుబడిని ఉపయోగించి తప్పించుకుతిరుగుతున్నారు. వాళ్లను అరెస్టు చేసే శక్తి పోలీసులకు లేకుండాపోయిందా? ఒక్కరిని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? గత రెండు దశాబ్దాలుగా చిత్రపురి సొసైటీ పేరుతో దజ్జాగా దోచుకుతింటూ, విలాసవంతమైన జీవితాలు గడుతున్న వాళ్లు పెద్దమనుషులుగా కనిపిస్తున్నారా? వాళ్లు చేసిన అరచాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సొసైటీ సభ్యులు కార్మికులనే కాదు, ప్రభుత్వాన్ని మోసం చేశారు. బ్యాంకులను మోసం చేశారు. చివరికి సాయం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చదలవాడ శ్రీనివాస్‌రావును కూడా మోసం చేశారు.

కార్మికులకు ఇల్లు కట్టుకునే స్ధోమత లేని సమయంలో ఎస్‌బిఐ కార్మికుల ఇళ్ల కోసం రూ.100 కోట్ల రుణం మంజూరు చేసింది..

అందులో మొదటి ధఫా రూ.50 కోట్లు ఇచ్చింది. కాని చిత్రపురి సొసైటీ ఆ సొమ్మును విలాసాలకు వాడుకున్నది. దాంతో బ్యాంకు ఇవ్వాల్సిన మిగతా రుణం ఆపేసింది. ఇక కార్మికుల నుంచి లక్షలు వసూలు చేశారు. ఏ నిర్మాణాలకైనా ముందు పది శాతం అడ్వాన్సులు చెల్లిస్తారు. కాని కార్మికుల నుంచి సొసైటీ 25శాతం వసూలు చేసింది. ఇలా కార్మికులను అన్ని రకాలుగా సొసైటీ వంచించింది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. అసలు కోఆపరేటివ్‌ సొసైటీ ప్రకారం సుమారు నాలుగువేల మందికి పైగా సభ్యత్వాలు కల్పించాలి. కాని చిత్ర పురి సొసైటీ 9వేలకు పైగా సభ్యులను చేర్చుకున్నది. అలా కూడా సొమ్ము కూడేసుకున్నది. అసలైన కార్మికులను మొండి చేయి చూపించింది. అసలు సినీ రంగంతో సంబందంలేని వాళ్లకు ప్లాట్లు కేటాంపులు చేసింది. అసలైన కార్మికులకు చుక్కలు చూపించింది.

సాయం చేయబోయి ఇరుక్కున్న చదవలవాడ: కార్మికుల ఇంటి కల నెరవేర్చాలన్న సదుద్దేశ్యంతో సొసైటీ గద్దల మాటలు నమ్మి చదలవాడశ్రీనివాస్‌రావు నిండా మునిగిపోయారు. కార్మికులకు ఇండ్లు కోసమంటూ ఆయన వద్ద కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. కాని ఇలాంటి భూముల తనకాతో అప్పు ఇవ్వకూడదన్న సంగతి శ్రీనివాస్‌రావు తెలిసి ఇచ్చారా? తెలియక ఇచ్చారా? అన్నది తెలియదు. కాని కార్మికులకు సాయంచేయబోయిన ఆయనను కూడా ఇరికించారు. నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదైన చిత్ర పురి సొసైటీ సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. ఎంత కాలం తప్పించుకుంటారు? కార్మికుల శాపాలు వృధాపోవు. ఖర్మ ఫాలోస్‌ అని చెప్పే సినిమా డైలాగ్‌ నిజం కాకపోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!