పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా
పరకాల నేటిధాత్రి
బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పాఠశాలల ప్రారంభం అవుతున్న సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరకాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ మధు అధ్యక్షతన దుస్తులు మరియు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,ఏకరూప దుస్తులు,పాఠ్య పుస్తకాలు నోట్ బుక్కులు ఉచితంగా అందజేస్తుందని అలాగే హై క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని మౌళిక సదుపాయాల కల్పించడం జరిగిందని ఉపాధ్యాయులు ఈ వివరాలను తల్లి తండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో విధ్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా మరొక అథిదిగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఐఏఎస్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలలు మరియు మన ఊరు మన బడి కార్యక్రమంలో మంజూరు చేయబడిన పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని విధ్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ, ఎంపిపి తక్కల్లపల్లి స్వర్ణలత, మాజీ శాసన సభ్యులు మొలుగూరి బిక్షపతి,ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు ఏ.వీ.బాస్కర్,మున్సిపల్ కమిషనర్ కె.నరసింహ, మండల విద్యాశాఖ అధికారి రమాదేవి,స్థానిక కార్పొరేటర్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, విధ్యార్థులు పాల్గొన్నారు.