నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అలాగే ప్రైవేట్ స్కూళ్లలో ప్లీజ్ నియంత్రణ చట్టం అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్,పిడీఎస్యు ఆధ్వర్యంలో కలక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డీ పార్థసారథి,ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,పిడీఎస్యు జిల్లా అధ్యక్షుడు అల్వాల నరేష్ లు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని వరంగల్ జిల్లా లోని ఉన్న ప్రైవేట్ పాఠశాల లో ప్లీజ్ నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమాలు పాటించకుండా జిల్లాలోని ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో మెడికల్, ఐఐటి, డీజి టెక్నో పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జిల్లా ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నియమాలు పాటించకుండా పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్, టైలు షూలు విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు వారు పేర్కొన్నారు.