Headlines

పొదుపులతో గౌడ కుల కుటుంబాల పురోగతి.

# ఘనంగా నర్సంపేట గౌడ సంక్షేమ సహకార పరిమితి సంఘం 2 వ వార్షికోత్సవ సభ

నర్సంపేట,నేటిధాత్రి :

నెల నెల పొదుపులు చేసుకోవడం వలన గౌడ కులస్తుల కుటుంబాలు భవిష్యత్తులో పురోగతి పొందుతాయని
గౌడ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ అన్నారు.నర్సంపేట డివిజన్ గౌడ సంక్షేమ సహకార పరిమితి సంఘం ద్వితీయ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ లో అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్ అధ్యక్షతన జరుగగా ప్రధాన కార్యదర్శి మాచర్ల ఐలుమల్లు గౌడ్ సంఘ నివేదిక సమర్పించారు. సంఘంలో నిధులు రూ.1 కోటి 13 లక్షల 61 వేల 433 మొత్తంగా కాగా ప్రతి సభ్యుని వాటా రూ.29 వేల 80 ఉండగా అందులో మొత్తం ఖర్చులు రూ.1లక్షా 65 వేల 410 లు అయినట్లు ఆర్థిక కార్యదర్శి గండి రాము గౌడ్ ప్రవేశపెట్టగా మహా సభలు హాజరైన సభ్యులు ఆమోదించారు.అనంతరం సంఘ అభివృద్ధి కోసం పలు విధాలుగా చర్చించుకున్నారు. గౌడ వెల్పేర్ కమ్యూనిటీ భవన ఏర్పాటు, ప్రతి సభ్యునికి గ్రూపు ఇన్సూరెన్స్ చేయించుటకు 2 లక్షల వరకు సాధారణ ఋణము మంజూరు లాంటి అంశాలు తీర్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లింగయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడకుల ఐక్యత కోసం, సంక్షేమం కోసం ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు.
ఈ మహాసభలో కార్యవర్గ సభ్యులు
బూర అశోక్ గౌడ్,ఊడుగుల శ్రీనువాస్ గౌడ్,బూర వేణు గౌడ్,రావుల లక్ష్మీనారాయణ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్,గండి నర్సయ్య గౌడ్,కందుకూరి జనార్దన్ గౌడ్,వల్లాల శ్రీహరి గౌడ్,నవీన్ కుమార్ గౌడ్ ,చీకటి శోభారాణి గౌడ్,దొంతి శ్రీలత గౌడ్,రామగోని సుధాకర్ గౌడ్,గొడిశాల భాస్కర్ గౌడ్,గండి సంతోష్ గౌడ్ ,ఆనంతుల రమేష్ గౌడ్,కారుపోతుల విజయకుమార్ గౌడ్,తాళ్లపెళ్ళి చంద్రమౌళి గౌడ్,పంజాల వెంకట్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తాళ్లపెళ్ళి కృష్ణ గౌడ్,కందుల శ్రీనివాస్ గౌడ్,గుల్లపెళ్లి ఉమెండర్ గౌడ్ ,గిరగాని సాంబయ్య గౌడ్,వేముల సాంబయ్య గౌడ్,నాగేళ్లి వెంకటనారాయన గౌడ్,సోల్తీ సారయ్య గౌడ్,దొమ్మతి సత్యం గౌడ్,డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్,గండి యాదగిరి గౌడ్,పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్,తాబేటీ రవి గౌడ్ గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!