# భారతీయ జనతా పార్టీలో చేరికలు..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజవర్గంలో రానున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున యువతకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామని భాజపా జిల్లా నాయకులు ,చేరికలు కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలో 3వార్డ్ వల్లబ్ నగర్ కు చెందిన యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నుండి భాజపాలో చేరినట్లు ప్రకటించారు. ఎలాంటి మచ్చలేని సేవా దృక్పకo కలిగి ఉండేవారిని ప్రజా ప్రతినిధులుగా తయారు చేస్తామని నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలియజేశారు.పార్టీలో చేరిన తప్పెట్ల సతీష్ ,తో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, కట్ల రామచందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ , బానోత్ వీరన్న ,నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూర్ సందీప్,కొంకిసా విగ్నేష్ గౌడ్, నాగేందర్, ఠాకూర్, ప్రతిక్ష సింగ్, చిలువేరు అన్వేష్, కుసుమ భవాని శంకర్, సోషల్ మీడియా నర్సంపేట ఇన్చార్జ్ సామల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.