జాడి వెంకటేశ్వర్లు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సర్పంచ్ లు ఎంపీటీసీ లు జడ్పీటీసీ ల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అలాగె
తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన గ్రామ కమిటీ నాయకులకు మండల కమిటీ నాయకులకు ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తల కు కృతజ్ఞతలు అని కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఓట్ల ద్వారా ప్రజలు నిరూపించారని. అన్ని వర్గాలు చూపు కాంగ్రెస్ వైపు ఉందని అన్నారు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న ఆరు గ్యారెంటీల తోనే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించారని సోనియా గాంధీ నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొనే దిశగా ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసుకున్న అదృష్టం లభించిందని ఆయన వివరించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు అవుతాయని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు సీతక్క నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులు గా పని చేసారని ముందు ఇంకా మరింత ఉత్సాహం తో పని చేయాలనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.