భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రభుత్వ చిహ్నం పై
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించాం, దీన్ని మేమూ స్వాగతిస్తున్నాము. వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలుసుకున్నాం. అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నాం.
మేము ప్రతిపాదిస్తున్న ఈ చిహ్నంలో ని గొప్పతనం ఏమిటంటే.. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ని మరియు దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ ని ఈ చిహ్నంలో ఉంచాము. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం మరియు అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గం పై అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సమ్మక్క సారలక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నం లో ఉంచాము.
ఈ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో సమానత్వ భావనని, పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది, భావి తరాల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి అవుతుంది. తెలంగాణ వైభవోపేతమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అవుతుంది. కాబట్టి ఈ చిహ్నాన్ని తమ ముందు (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు) ధర్మ సమాజ్ పార్టీగా మేము ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా దీనిని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని… తెలియ జేయండి.ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి కండె రవి, కోశాధికారి బొజ్జపల్లి మహర్షి, నాయకులు మల్యాల సాంబయ్య,బండారి దశరధం పాల్గొన్నారు.