
రైతులు అధైర్య పడొద్దు
చివరి గింజ వరకు కొంటాం
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
శాయంపేట నేటి ధాత్రి:
ధాన్యం కొనుగోలు ముమ్మరం చేయాలి కొనుగోలు పూర్తయ్య వరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. మండలంలో ప్రగసింగారం వసంతపూర్ కొప్పుల సహకార సంఘాలు మహిళ సంఘాలు ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా అంతా 88% పూర్త యిందని, శాయంపేట మండల కేంద్రంలో మాత్రమే ఉంది దాదాపుగా 15% ఉంటుందని తెలపడం జరిగింది వర్ష ప్రభావం వల్ల రైతులు కాపాడేందుకు అందుబాటులో ప్రతి రైతుకు పరదాల సౌకర్యం చేస్తాము అని సెంటర్లో ఉన్న వారికి మొత్తం టార్పల్లిన్ ఇవ్వాలని ఆదేశించింది.జిల్లా మొత్తం 160 సెంటర్లో కొనుగోలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఐకెపి సెంటర్ల ద్వారా 88% పూర్తి చేశామని తెలపడం జరిగింది
మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఎమ్మార్వో ఎంపీడీవో వ్యవసాయ మండల అధికారి, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.