
భద్రాచలం నేటి ధాత్రి
ప్రజల అవసరాలకు తట్టెడు గ్రావెలుకు సైతం అనుమతి ఇవ్వని రెవెన్యు వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు
ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు తగ్గొడుతూ ఇసుక ర్యాంపులోకి రోడ్డు వెయ్యడం కోసం దొడ్డి దారిన గ్రావలను తరలిస్తున్న ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లపై రెవెన్యూ వారికి ఎందుకు ఇంత ప్రేమ
అనుమతులు లెకుండా గుట్ట తవ్వకాలు జరుపుతున్న (భారీ యంత్రాలైన) JCB ను తోలకాలు జరుపుతున్న లారీలను వెంటనే సీజ్ చెయ్యాలి
సంబంధిత అక్రమార్కులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలి లేకుంటే ఉద్యమిస్తాం
CPIML మాస్ లైన్ ప్రజా పంధా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ దుమ్ముగూడెం మండలం లోని WL రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు జోక్యం చేసుకొని నిలిపివేయాలని cpiml మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ ఆద్వర్యంలో దుమ్ముగూడెం మండల రెవెన్యూ కార్యాలయం అధికారికి RI ఆదినారాయణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ రేగుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గుట్టని కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలైన జెసిబి లతో తవ్వకాలు జరుపుతూ లారీలతో ఇసుక ర్యాంపు లోకి రోడ్డు వేయడానికి వంద లాది ట్రిప్పులు తోలుతున్నారు ఇప్పటికే నాలుగు రోజులుగా ఇది కొనసాగుతుంది ఇది ఇట్లాగే కొనసాగితే ఆ గ్రామం ప్రజలకు భవిష్యత్ లో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే గ్రామంలో ఉన్న పశువులు మేత కోసం, స్మశాన వాటిక కోసం కాల కాల క్రమేణా పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల స్థలాల కోసం తదితర అవసరాలకు ఈ గుట్టనే ఇక్కడి ప్రజలు వుపయోగిస్తారు కాబట్టి ప్రజల అవసరాలను, బలహీనతలను అడ్డం పెట్టుకొని ప్రజా సంపద అయిన గ్రావెల్ ను కొందరు లూఠీ చేస్తున్నారని అన్నారు గ్రామస్తులు అవసరాల కోసం తట్టెడు గ్రావెల్ తీసుకుపోయిన అడ్డుపడే రెవిన్యూ అధికారులకి ఇక్కడ జరుగుతున్న లూఠీ కనబడడం లేదా అని ప్రశ్నించారు గ్రావెల్ మట్టి ఇసుక ఒక్క ట్రక్కు సైతం అక్రమంగా తరలిస్తే ఆ వాహనాల పైన ఆ వ్యక్తుల పైన కేసులు పెట్టే రెవిన్యూ వారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు అక్రమార్కుల పట్ల ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ల పట్ల రెవెన్యు వారు ఎందుకింత మెతక వైఖరి వహిస్తున్నారని విమర్శించారు తక్షణమే అనుమతులు లెకుండా జరుగుతున్న గుట్ట తవ్వకాలను,గ్రావెల్ అక్రమ రవాణా అని నిలిపివేయాలని, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టని రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలను తొలకాలు జరుపుతున్నా భారీ యంత్రాలైన జెసిబి లను లారీలను తక్షణమే సీజ్ చేయాలని సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు
ఈకార్య్రమంలో పార్టీ దుమ్ముగూడెం మండలం కార్యదర్శి దాసరి సాయన్న పార్టీ నాయకులు బాబురావు,భాస్కర్, ప్రవీణ్ తదితులు పాల్గొన్నాను