
వైన్స్ పక్కనే పాత భావి మందుబాబులకు ప్రాణాలకు ప్రమాదం
జనవాసాలలో మందుబాబులు తాగుడు కార్యక్రమాలు
తాగిన కాళీ సీసాలను పక్కనే ఉన్న దుకాణ సముదాయాలలో ముక్కలు చేయడం
ఏ మాత్రం చర్యలు తీసుకొని వైన్స్ యజమాన్యం
రామయంపేట (మెదక్)నేటిధాత్రి
రామయంపేటలోని వెంకటేశ్వర వైన్స్ ఉన్న స్థలం పక్క కాలనీ వాసులకు ఎన్నో కష్టాలపాలు చేస్తున్నాయని మనశ్శాంతి లేకుండా జరుగుతున్నదని కాలనీవాసులు ఆవేదన వెలబుస్తున్నారు . వెంకటేశ్వర వైన్స్ దాన్ని ఆనుకొని పర్మిట్ రూమ్ ఎలాంటి పహారి గోడ లేకుండా పరిధాల రేకులతో ఏర్పాటు చేయడం వల్ల మందుబాబుల మాటలు రనగొనదునులు తమకు నిద్ర లేకుండా చేస్తున్నాయని రాత్రి 11 గంటల వరకు కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పక్కనే ఉన్న ఇంటిలో నివసిస్తున్న భాస్కర్ తెలిపారు .అంతేకాకుండా పర్మిట్ రూములు ఆనుకొని పెద్ద పాత బావి తక్కువ ఎత్తులో ఉండడం మందుబాబులు ప్రమాదకరంగా మారిందని అన్నారు .ఇంతకుముందు కూడా ప్రాణాపాయాలు జరిగాయని ఆయన తెలిపారు. వెంకటేశ్వర వైస్ ఈ ప్రాంతంలో ఉండటానికి ఎలాంటి నియమ నిబంధనలు అనుకూలంగా లేవన్నారు ప్రజావాసాలకు దూరంగా పర్మిట్ రూములను బయటకు కనిపించకుండా ఏర్పాటు చేయవలసి ఉండగా ఇక్కడ మాత్రం పార్ధాలు రేకులు అడ్డంపెట్టి అనుమతులు ఇవ్వడం చేస్తున్నారు .జిల్లా ఎక్సైజ్ అధికారులకు దృష్టికి తీసుకుపోయిన ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉండడానికి ఎటువంటి ఆస్కారం లేదని నియమ నిబంధనలు లేవని ఎప్పటికైనా ప్రమాదకరమైన బావి పక్క కాలనివాసులకు ఇబ్బందులకు గురిచేస్తూ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని వెంటనే ఎక్సైజ్ కమిషనర్ ఇక్కడి నుంచి వైన్ తొలగించాలని వారి డిమాండ్ చేస్తున్నారు వైన్స్ యాజమాన్యం నిరంకుశ వైఖరి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.