
– జోరుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం….
– కొల్చారం మండలం నుంచి భారీ మెజార్టీని ఇస్తాం…
-నాగులురి మల్లేశం గౌడ్…
కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :-
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కొల్చారం మండలంలో పోచారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిలుముల సుహాసిని రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని కిష్టాపూర్, పోతం శెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాలలో ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు 2, 500, గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకు , ఉచిత కరెంటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను తప్పకుండా అమలు చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ , ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మసూద్ రెడ్డి, మెదక్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి , నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హంసి బాయ్, కిష్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం యాదవ్, పొతం శెట్టిపల్లి మాజీ సర్పంచ్ గడ్డమీది నర్సింలు, అప్పాజీపల్లి మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్, హంసన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్ , రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.