— మళ్ళీ మోసపోతే గోస పడతాం,
— చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధును గెలిపించండి,
నిజాంపేట: నేటి ధాత్రి
పది సంవత్సరాలుగా మోసపోతునే ఉన్నాం మళ్లీ మోసపోతే గోస పడదాం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకుందాం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మండల కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సందర్భంగా బీఆర్ఎస్, బిజెపి పార్టీలు, టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన మూడు నెలల్లోనే కోటి 85 లక్షలతో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని, అలాగే ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ మెదక్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు కమిటీ వేయడం జరిగిందని అతి త్వరలో కర్మాగారాన్ని తెరిచి రైతులకు అందుబాటులో తెస్తామన్నారు. భీఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దని, అగ్రకులానికి సంబంధించిన వారని, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, మైనోద్దీన్, ఇక్బాల్,సుమారు 30 మంది భీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు, ఎంపీపీ సిద్ధ రాములు, లద్ద సురేష్, మాజీ సర్పంచులు ముత్యం రెడ్డి, అమర్ సేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, మారుతి, సత్యనారాయణ రెడ్డి, నసీరుద్దీన్, నరేందర్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.