కలెక్టర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లిదండ్రులు

భూపాలపల్లి నేటిధాత్రి

చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజిపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ(7)గత సంవత్సరం దీపావళి వేడుకలులో ప్రమాద వశాత్తూ గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకొని చిన్నారి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ చిన్నారి అక్షయకు వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు. తక్షణమే అక్షయ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఎంజిఎం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి అక్షయకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అక్షయ వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనకు తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ కు సూచించారు.
చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎంజిఎం లో వైద్య సేవలు లేకపోతే హైదరాబాద్ సిఫారసు చేస్తామని అన్నారు. అక్షయ తల్లిదండ్రులు అధైర్య పడవద్దని
చిన్నారి అక్షయ త్వరగా కోలుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *