# మండుతున్న ఎండలు ప్రజల దాహర్థి తీర్చే దిశగా పోలీసులు ముందడుగు
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ లో ములుగు ఎస్ పి గారి చొరవతో స్థానిక ఎస్సై వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు దీనిని గురువారం నాడు జిల్లా ఎస్పి ప్రారంభించారు కార్యక్రమంలో ఎస్పి మాట్లాడుతూ ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు స్థానిక ఎస్ ఐ సి ఐ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృశ్య జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా పిల్లలు ముసలివారు అత్యవసరం అనుకుంటే తప్ప ఎండలో బయటికి రాకూడదని తప్పని పరిస్థితులలో గొడుగు, మంచి నీరు వెంట ఉంచుకోవాలని తెలియచేసారుఈ కార్యక్రమంలో డి ఎస్ పి ములుగు రవీందర్ సి ఐ ములుగు రంజిత్ కుమార్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు ఎస్ ఐ లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.