
-హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు
-బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది
-మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు
-వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్
హసన్ పర్తి/ నేటి ధాత్రి
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మీ మద్దతు(ప్రజలు) ఇవ్వాలని వరంగల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. గురువారం హంటర్ రోడ్ లోని వేద బాంకెట్ హాల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, పార్లమెంటు ప్రభారి మురళీధర్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,హన్మకొండ,వరంగల్ జిల్లాల అద్యక్షులు రావు పద్మ, గంట రవి కుమార్, మాజీ ఎంపి చాడ సురేష్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా నిలువబోతున్నారని, అందుకు దేశ ప్రజానీకం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు. మోడీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు కనుమరుగయ్యయని, కాంగ్రెస్ హయాంలో దేశానికి అన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక భారతదేశం ఎగుమతులు చేసే స్థాయికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి బలపరిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని, నేడు అవినీతి రహిత పాలనను అందిస్తూ ఆదర్శ ప్రధానిగా మన ప్రధాని నరేంద్ర మోడీ నిలవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి, ఆ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు తీసుకువచ్చిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు దొరకక ఇతర పార్టీల నాయకుల వేటలో ఉన్నారని, మేము ఇప్పటికే మండల స్థాయి వరకు ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నామని, ప్రజల మద్దతు కూడగట్టడంలో బిజెపి ముందు వరుసలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని, అటువంటి కుటుంబ పాలన పార్టీలను ప్రజలు చరమగీతం పడతాయన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవతారని అందుకు ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నేడు(శుక్రవారం) మడికొండ సత్య సాయి కన్వెన్షన్ లో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అద్యక్షులు విజయ సంకల్ప సమ్మేళనంలో పార్లమెంట్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.