భారీగా తరలి వచ్చిన ప్రజలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
గుల్లకోట లో వైభవంగా సీతా రామ లక్ష్మణ్ ల వారి శోభా యాత్ర అంగ రంగ వైభవంగా జరిగింది గురువారం ఉదయం సీతారామ లక్ష్మణ్ ల వారి విగ్రహాలు గ్రామ ముఖద్వారం (కమాన్) వద్ద నుండి , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ వెంకట రమణా రెడ్డి దంపతులకు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ఘన స్వాగతం పలికి,అశేష భక్త జనం తరలి రాగా,మంగళ హారతులతో డప్పు చప్పులతో,సంగీత వాయిద్యాల తో ( డిజె సౌండ్స్) తో స్వామివారిని ఊరేగింపుగా,ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకురావడం జరిగింది, అలాగే శుక్ర వారం,శనివారం 12,13వ తేదీన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు 16,17వ తేదీన సీతారాముల వారి కల్యాణం అంగ రంగ వైభవంగా భద్రాచలం లోని సీతా రాములని మైమరిచే విధంగా జరపబడును అని , మన గ్రామంలో ఈ సంవత్సరం నుండి నూతనంగా సీతా రాముల కళ్యాణం జరుపుకోవడం చాల ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ,ఇట్టి కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు అని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు అనంతరం విగ్రహాల దాతలకు ఘనంగా శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ఛైర్మెన్ సాన మారుతి,కమిటీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్,ఎంపీటీసీ సభ్యులు గొల్ల పెల్లి శ్రీజ మల్లేశం,మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ ఉప సర్పంచ్ బిసగోని శ్రీనివాస్,హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
గుల్లకోట లో వైభవంగా సీతారామ లక్ష్మణ్ ల వారి శోభా యాత్ర !!
![](https://netidhatri.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-11-at-5.29.49-PM.jpeg)