# 320 క్వింటాళ్ల రేషన్ బియ్యం,లారీ సీజ్,
# భద్రకాళి రైస్ మిల్లు యజమాని,లారీ డ్రైవర్ పై కేసు నమోదు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్నట్లు పర్వతగిరి ఎస్సై వెంకన్న నాయక్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామ సమీపంలో పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు పర్వతగిరి పోలీసులు 320 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. నెక్కొండ మండల బంజరపల్లి గ్రామానికి చెందిన భద్రకాళి రైస్ మిల్లు నుండి నెక్కొండ తొర్రూరు ప్రధాన రహదారిపై తరలిస్తున్న క్రమంలో అన్నారం వద్ద పక్కా సమాచారం మేరకు (టీఎస్ 07 యూబి 7929) లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం లారీ వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించారు.ఇద్దరిపై కేసు నమోదు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేఅయినట్లు పర్వతగిరి ఎస్సై వెంకన్న నాయక్ తెలిపారు. నెక్కొండ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలలో తక్కువ ధరకు వసూలు చేసిన రేషన్ బియ్యం కొనుగోళ్లు చేసి అధిక ధరలకు అమ్ముకొని అక్రమ బాటలో డబ్బులు సంపాదించుకోవాలని రైస్ మిల్లు యజమాని సంఘని సతీష్ లారీలో అక్రమంగా తరలిస్తుండగా పర్వతగిరి మండలం అన్నారం సమీపంలో సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. మిల్లు యాజమాని సతీష్ , డ్రైవర్ పసుల వెంకటేష్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న నాయక్ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న వారిలో టాస్క్ఫోర్స్ ఏసిపి ఎ.మధుసూధన్,ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్,,ఎస్ఐ శరత్,పిసి.
,పి.విజయ్ కుమార్,టాస్క్ ఫోర్స్ పిసి జి.శ్రీనివాస్, పర్వతగిరి పోలీసులు ఉన్నారు.