గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెను గుమట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఏలేటి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.6 ఏప్రిల్ 1980 న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పడి నేటికీ నలబై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు సామ అనంతరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా మరోసారి కేంద్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని లింగ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో 10 లోక్ సభ స్థానాలను గెలవ బోతున్నామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి వెంకటేష్, ఓడ్నాల అనిల్, నేరెళ్ల లక్ష్మీనారాయణ, ఓడ్నాల రాజేశం, బొల్లం శ్రీధర్, పప్పుల వెంకటేష్, గాజంగి శ్రీనివాస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.