రామకృష్ణాపూర్, మార్చి 29, నేటిధాత్రి:
గుడ్ ఫ్రైడే సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని విద్యానగర్ మన్నా చర్చ్ లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పాస్టర్ల ఆశీర్వాదం పొందారు. అనంతరం బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగౌని సుదర్శన్ గౌడ్ కుమారుడి వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్ళి దంపతులను గడ్డం వంశీ ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్ మాతృమూర్తి అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.