తప్పుడు పత్రాలతో పదోన్నతి
ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్న అధికారి
Click on link to download document
New Doc 03-19-2024 13.49
ఆధారాలతో సహా బయటపెట్టిన పట్టించుకోని పై అధికారులు
మరి అధికారుల నిర్లక్ష్యం లేక అండదండలా
తనదైన రీతిలో అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను మోసం చేస్తూ తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతి పొంది నన్ను ఎవరు ఏం చేస్తారులే అధికారులు నాకు అండగా ఉండగా నాకేం అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఒక మున్సిపల్ అధికారి వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గుర్రం శ్రీనివాస్ రెడ్డి అసలు బాగోతం ఇది. అతను సిద్దిపేటకు వచ్చిన కొద్ది కాలంలోనే అతనిపై ఎన్నో అనుమానాలు ఆరోపణలు గుప్పుమన్నాయి. అతను న్యాయబద్ధకంగా రూల్స్ పాటించకుండా తప్పుడు పత్రాలను సృష్టించి పదోన్నతి పొందాడని గుసగుసలు వినిపించాయి. దీనిపై కౌన్సిల్ ఫర్ ఆర్టీఐ ప్రెసిడెంట్ షాదుల్ వివరాలు కావాలని 2020 సెప్టెంబర్ 27న సమాచార హక్కు చట్టం ద్వారా అతని ఉద్యోగానికి మరియు పదోన్నతికి సంబంధించిన అన్ని అర్హత పత్రాలు వివరాలు తెలుపాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తదుపరి 27 అక్టోబర్ 2022 రోజున మొదటి అప్పిల్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనను కూడా సమాచారం అందించలేదు ఎక్కడ వీళ్ళ అవినీతి బయటపడుతుందోనని కావాలనే సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు.సదరు అధికారినీ వివరణ అడగగా సదరు అధికారి 1996లో డిపార్ట్మెంటల్ టెస్ట్ 146 148 రెండు పాస్ అయ్యానని వివరణ ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన సమాచారం మాత్రం ఇవ్వలేకపోయారు. కావున టిఎస్పిఎస్సి కి ఇతని వివరాలు కావాలని డిసెంబర్ 22న సహ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా వారు ఏపి పీఎస్సీ నీ సమాచారం కోరమని సమాధానం ఇచ్చారు. తదుపరి 27 జనవరి 2023న ఏపీపీఎస్సీ కి సహా చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా వారు స్పందించి 1996లో 146 148 రాసిన వారి పాసైన వారి హాల్ టికెట్ నెంబర్ తో సహా సమాచారం అందించారు. కానీ అందులో సిద్దిపేట మున్సిపల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గుర్రం శ్రీనివాస్ రెడ్డి కేవలం 148 మాత్రమే పాస్ అయ్యారని 146 పాస్ కాలేదని స్పష్టంగా తెలిసింది. కానీ అధికారులను అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతికి అర్హతలు లేకున్నా కూడా మోసపూరితంగా వ్యవహరించి పదోన్నతి పొందారని పై అధికారులకు గతంలో సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మరియు సంపత్ కుమార్ నూతనంగా వచ్చిన కమీషనర్ ప్రసన్న రాణి కి కుడ ఆధారాలతో సహా తెలిపిన కూడా ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఒక తప్పుడు అధికారికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా పై అధికారులు ఎందుకు తప్పుడు అధికారికి వత్తసు పలుకుతున్నారో ఆ అధికారికి భయపడుతున్నారా.? లేక అమ్ముడుపోయారా. ? అనే చాలా రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై 07 జూన్ 2023న ప్రిన్సిపల్ ఆఫీస్ సెక్రటరీ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయానికి మరియు కమిషనర్ మరియు సంచాలకులు పురపాలక పరిపాలన శాఖ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందనీ దానికి వారు తగిన సమాచారం దరఖాస్తుదారునికి అందించాలని అలాగే తగిన విచారణ జరిపించి వెంటనే విచారణ కాపీలు అందించమని తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. అయినను కూడా సిద్ధిపేట మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు తప్పు చేసిన అధికారికి వత్తాసు పలుకుతూ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తప్పుడు అధికారికి వత్తాసు పలుకుతూ అతని పదవి విరమణ కాలం ముగిసేంతవరకు కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పై అధికారులు స్పందించి మేనేజర్ పై విచారణ జరిపి అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అతనికి వత్తాసు పలుకుతూ అతని కాపాడుతూ వచ్చిన పై అధికారులను సైతం వారిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ ఆర్టీఐ ప్రెసిడెంట్ షాదుల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేసైన తప్పుడు అధికారిపై చర్యలు తీసుకునే విధంగా న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు…