Headlines

బడుగులకు అండ గులాబీ జెండా: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

కేసిఆర్ నాయకత్వంలో బడుగుల వికాసం.

బడుగుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసిఆర్.

సంక్షేమ పథకాలన్ని బడుగులను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినవే.

తెలంగాణ లో బడుగులకు అండా దండా గులాబీ జెండానే అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే బడుగుల వికాసం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పాలనలో అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు బడుగుల జీవన ప్రమాణాలు పెంచాయి. పల్లెల గతి మారింది. కుల వృత్తులకు పునరుజ్జీవనం జరిగింది. దళితుల జీవితాలలో దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మొదటి సారి అమలు చేసిన ఏకైక మానవతా మూర్తి కేసిఆర్ అని వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని తాపత్రయపడిన దార్శనికుడు కేసిఆర్. ఎప్పటికైనా తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. బడుగుల సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడు కేసిఆర్. తనకు రెండో సారి రాజ్యసభ అవకాశం కల్పించిన కేసిఆర్ కు వద్దిరాజు రవిచంద్ర బడుగుల తరుపున ఖమ్మం పట్టణంలో కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల అతిరథమహారధులు, నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, రవిచంద్ర అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ తొలి సారి రాజ్యసభ ఇచ్చినప్పుడే రెండో సారి కచ్చితంగా అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించిన కేసిఆర్ కు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.‌ తనకు రెండో సారి రాజ్యసభ అవకాశం కల్పించడమంటేనే బడుగుల మీద కేసిఆర్ కు ఎంత ప్రేమ వుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన నాయకుడుగా కేసిఆర్ పుటల్లో సువర్ణాక్షరాలతో చరిత్రను పదిలం చేసుకున్నారు. తెలంగాణ సాధించి దశాబ్ద కాలం పాటు ప్రజా సంక్షేమ పాలన చేసి తెలంగాణాను బంగారు తెలంగాణ చేశారు.‌ బడుగుల సంక్షేమం నిరంతరం పాటు‌ పడిన కేసిఆర్‌కు సర్వదా కృతజ్ఞుడునై వుంటానని రవిచంద్ర పేర్కొన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారానికి ఇది తాత్కాలిక విరామం మాత్రమే. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. అందువల్ల బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిఆర్ఎస్‌ను గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం వుందని రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన హైదరాబాద్ మేయర్ పదవిని కూడా రెండుసార్లు బీసీలకే ఇచ్చారు. ఇదే కేసిఆర్ కు బిసిల పట్ల వున్న అభిమానానికి నిదర్శనమని రవిచంద్ర గుర్తు చేశారు. బీసీలకు గత ఎన్నికలలో బడుగు బలహీనవర్గాలకు అత్యధికంగా సీట్లు ఇచ్చారు. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మంత్రి పదవిని ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇతోదిక నిధులు మంజూరు చేశారు. పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ప్రగతిని పరుగులు పెట్టించారు. పార్థసారధి రెడ్డికి, నాకు రాజ్యసభ ఇచ్చారు. ఖమ్మం జిల్లాపై కేసిఆర్ కు వున్న ప్రేమను చూపించారు. ఖమ్మం జిల్లాకు అంత ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడి నుంచి మూడుసార్లు ఒక్క ఎమ్మెల్యే నే ఇచ్చాము. ఇప్పుడైనా నామ నాగేశ్వరరావును ఎంపీగా గెలిపించి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలియజేద్దామని రవిచంద్ర పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నో నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపి గెలిపించుకుందామని అన్నారు. ఖమ్మం జిల్లా ద్వారానే టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది అన్న పేరును సమిష్టిగా తుడిచేద్దాం.. ఖమ్మం జిల్లాను బిఆర్ఎస్ కు కంచుకోటను చేద్దాం. ఖమ్మం జిల్లా కరువును పారద్రోలిన కేసిఆర్‌కు రుణం తీర్చుకునే అవకాశం మరో సారి వస్తోంది. ప్రజలందరికీ రెండు చేతులెత్తి మొక్కుతున్నాను. నామా నాగేశ్వరరావు బారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఇనుగుర్తి నాకు జన్మనిస్తే దేశంలో నన్ను నిల్చోపెట్టింది నాకు గుర్తింపు ఇచ్చింది ఖమ్మం జిల్లా నే అని రవిచంద్ర బావోద్వేగంతో చెప్పారు. .మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో మరోసారి కవిత గెలుపుకు కృషి చేస్తానని సభా ముఖంగా రవిచంద్ర ప్రకటించారు. ఇంతమంది బీసీ నాయకులు వచ్చి కేసీఆర్ కృతజ్ఞత సభకు తెలంగాణ నలుమూలల నుంచి హజరైన బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరునా రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!