
మందమర్రి, నేటిధాత్రి:-
మండలంలోని ఆదిల్ పేట గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనులను మండల ఎంపిపి గుర్రం మంగ శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈజిఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.