
ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్
అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం
బి మోహన్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని మాట్లాడుతూ 2023-24 విద్య *సంవత్సరం మరి కొన్ని రోజులలో ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే నిధులు విడుదల కాక, దాదాపు 4000 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉందని ఆయన అన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్ దృశ్య పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు మోహన్ నాయక్, పవన్ కళ్యాణ్, , ప్రవీణ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు