బిఆర్‌ఎస్‌ కే జై కొట్టిన తెలంగాణ.

https://epaper.netidhatri.com/

` మూడోసారి బిఆర్‌ఎస్‌ అధికారం ఖాయం.

` దక్షిణాదిన హాట్రిక్‌ సిఎం. కేసిఆర్‌.

` బిఆర్‌ఎస్‌ కు 70-74.

` కాంగ్రెస్‌ కు 37-38

`బీజేపీ 3-1

`మజ్లీస్‌ కు 7-6

` ఇతరులు 0-1

` డి.ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో వెల్లడి.

`కర్ణాటక ఎన్నికలలో కచ్చితమైన లెక్క చెప్పింది డి. ప్యాక్‌ మాత్రమే.

` మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,ఎన్నికలలో కూడా డి.ప్యాక్‌ సర్వేనే నిజమైంది.

`మునుగోడు లో మెజారిటీతో సహా చెప్పింది డి.ప్యాకే.

` రైతులంతా బిఆర్‌ఎస్‌ వైపే.

`కాంగ్రెస్‌ ను రైతులు నమ్మడం లేదు.

`మార్పు కోరుకోవాలని ప్రజలు అనుకోవడం లేదు.

`బిఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలపైనే జనం ఆసక్తి.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన మీద మెజారిటీ ప్రజల సంతృప్తి.

` సోషల్‌ మీడియా లో కనిపించేదంతా హంబక్‌…

`పార్టీలు తయారు చేస్తున్న బోగస్‌ వీడియోలు.

`కాంగ్రెస్‌, బిజేపి రెండు, మూడు స్థానాల కోసం కొట్లాట.

హైదరబాద్‌,నేటిధాత్రి :

తెలంగాణ మళ్లీ బిఆర్‌ఎస్‌కే జై కొడుతోంది. ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్సే అధికారంలోకి రాబోతోంది. దక్షిణాదిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మూడోసారి వరుసగా ముఖ్యమంత్రి అయిన వారు దక్షిణాదిలోనే లేరు. తొలిసారి కేసిఆర్‌ వరుసగా మూడోసారి పార్టీని అధికారంలోకి తేనున్నారు. హాట్రిక్‌ సిఎంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. అంతకు ముందు దేశంలోనే ఏ నాయకుడు ముందస్తుకు వెళ్లి పార్టీని గెలిపించుకున్న సందర్భం లేదు. అది కేంద్రమైనా, రాష్ట్రమైనా ముందస్తు ఎవరికీ కలిసిరాలేదు. కాని ఒక్క కేసిఆర్‌కు మాత్రమే ముందస్తు కలిసొచ్చింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్ర్రంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులు ప్రయోగాలు చేశారు. ఓడిపోయారు. తమిళనాడులో జయలలిత ప్రయోగం చేసింది. కాని ఓడపోయింది. కేంద్రంలో వాజ్‌పాయ్‌ కూడా ముందస్తు ప్రయోగం చేశారు. కుదరలేదు. కాని వారికి ఎవరికీ సాధ్యపడని విజయం కేసిఆర్‌ సొంతమైంది. ముందస్తుకు కొత్త చరిత్ర లిఖించారు. ఇప్పుడు మూడోసారి వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరో చరిత్ర సృష్టించనున్నారు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అన్నం ఉడికిందా? లేదా? అన్నంత సులువు కాదు. ప్రజాభిప్రాయ సేకరణ. ఇటీవల చాలా సర్వే సంస్ధలు తూతూ మంత్రంగా వివరాలు వెల్లడిస్తున్నాయి. జనం నాడి తెలుసుకోవాలంటే రాత్రికి రాత్రి అయ్యేది కాదు. జనం తమ అభిప్రాయాలను అంత సులువుగా చెప్పరు. కొన్ని యూటూబ్‌ ఛానళ్లు తమ సొంత మనుషులతో చేయించే వీడియోల ద్వారా అధికార పార్టీకి వ్యతిరేక ప్రచారం చేయడం కోసం విడుదల చేస్తున్న సర్వే ఫలితాలు ఒక హంబక్‌. సర్వే సంస్ధలకు గతం తాలూకు అనుభవాలు కూడా కావాలి. నాటి ఫలితాలు కూడా ఇప్పుడు పోల్చుకోవాలి. గతంలో ఎంత కరక్టుగా ఫలితాలు వెల్లడిరచాయన్నది కూడా ఎంతో ముఖ్యం. అంతేకాని ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లుగా సర్వే సంస్థలు తమ ఇష్టాను సారం వివరాలు వెల్లడిరచడం వల్ల ప్రజలు మారుతారనుకోవడం కూడా సరైంది కాదు. ప్రజలపై ఎవరి ప్రభావం వుండదు. వారి నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. వారి నిర్ణయం తెలుసుకోవడం కూడా కష్టం. అంతే! సర్వేలంటే రాత్రికి రాత్రి రాసేసే వివరాలు కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వారు ఎవరూ కాంగ్రెస్‌ వైపు ప్రజలు చూస్తున్నారన్న లెక్కలు చెప్పలేరు. ఎందుకంటే తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌కే జైకొడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనే మళ్లీ, మళ్లీ కోరుకుంటోంది. తెలంగాణ ఈ రోజు వచ్చిందటే అందుకు కారణం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేసిఆర్‌. రైతు బంధు ఇచ్చి పేద రైతులను ఆదుకున్నది కేసిఆర్‌. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులకు అండగా వున్నది కేసిఆర్‌. రూ.200లున్న పించన్‌ను, రూ.2000 చేసి, కుటంబ పెద్దలకు భరోసా ఇచ్చింది కేసిఆర్‌. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కేసిఆర్‌. ఇదీ తెలంగాణ క్షేత్రస్ధాయిలో జనం చెప్పే మాట. తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కోరుకుంటున్నారో తెలియజేసే అంశాలు. అయితే కాంగ్రెస్‌పార్టీకి గత ఎన్నికల కన్నా కొన్ని సీట్లు పెరిగే ఛాన్సు వుంది. గత ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయింది. కాని ఈసారి బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లు పెరిగే సూచనలు, అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లలో కాంగ్రెస్‌ బలంగా వుండడం కూడా గమనార్హం. అయినా బిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఖాయం.

డిప్యాక్‌ ముంబైకి చెందిన సర్వే సంస్ధ. డిప్యాక్‌తో కలిసి నేటిధాత్రి కొన్ని నెలలుగా తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.
సర్వేను ఎంతో పడ్భందీగా నిర్వహించి, తెలంగాణ ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తోంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ రావడం ఖాయం. బిఆర్‌ఎస్‌కు కచ్చితంగా 70 నుంచి 74 సీట్లు వచ్చే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు 37 నుంచి 38 సీట్లకే పరిమితం కానున్నది. బిజేపి 1 నుంచి 3 సీట్లు సాధించే అవకాశం వుంది. ఎంఐఎం. 6 నుంచి 7 సీట్లు గెల్చుకోవచ్చు. ఇతరులకు సీట్లు వచ్చినా అవి కాంగ్రెస్‌ సీట్లు తగ్గొచ్చు. ఇది డిప్యాక్‌ , నేటి ధాత్రి సంయుక్త సర్వే లెక్క. ఇప్పటి వరకు డిప్యాక్‌, నేటిధాత్రి లెక్క ఎప్పుడూ తప్పలేదు. గత ఐదేళ్లుగా డిప్యాక్‌. నేటిధాత్రి సర్వేలు నిజమయ్యాయి. మహరాష్ట్ర ఎన్నికల్లో డిప్యాక్‌ సర్వే ఫలితాలే నిజమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మళ్లీ బిజేపి వస్తుందని గతం కంటే మెజార్టీ పెగుతుందని లెక్కలతో సహా డిప్యాక్‌ చెప్పింది. అదే రుజువైంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందిన డిప్యాక్‌ చెప్పింది. అదే వాస్తవమైంది. ఆ మధ్య జరిగిన కర్నాటక ఎన్నికల్లో నెల రోజుల మందే కర్నాకట ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పడమే కాదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న వివరాలు ముందే చెప్పింది. కర్నాటక పలితాలు కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లకు డిప్యాక్‌. నేటిధాత్రి చెప్పిన సంఖ్యనే వచ్చింది. ఒక్కసీటు కూడా అటూ, ఇటు కాలేదు. అంతలా ప్రజల నాడిని పట్టుకొని చెప్పిన సంస్ధ డిప్యాక్‌. కర్నాటక ఎన్నికల్లో మళ్లీ బిజేపియే అంటూ చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్‌కు తక్కువ మెజార్టీ వస్తుందని కొన్ని చెప్పాయి. కాని డి. ప్యాక్‌ మాత్రం కాంగ్రెస్‌కు 135 సీట్లు వస్తాయని చెప్పింది. సరిగ్గా అదే సంఖ్య వచ్చింది. అలా నిబద్దతకు మారుపేరుగా డిప్యాక్‌ సర్వే సంస్థ పనిచేస్తుంది. ఇక మునుగోడు విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని, మెజార్టీతో సహా చెప్పిన ఏకైక సర్వే సంస్ధ డిప్యాక్‌. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పడం జరిగింది. మునుగోడులో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఖచ్చితంగా 10వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పడం జరిగింది. ఇలా నేటిధాత్రి, డిప్యాక్‌ల సర్వేలు సంచలనం సృష్టించాయి. ఈసారి తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పాలన సంక్షేమ పాలన.
అది కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌తోనే సాధ్యమౌతుందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ రూపంలో వస్తున్న చంద్రబాబు గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వల్ల కాంగ్రెస్‌ పెరిగిందమీ లేదన్నది కూడా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎవరు? అన్న ప్రశ్నకు గ్రామీణ ప్రాంతాలలో సమాధానం లేదు. స్వయంగా ఒక దశలో రేవంత్‌రెడ్డి నేనెరో తెలుసా? అంటే తెలియదని ఆయనతోనే ప్రజలు చెప్పారు. అంటే రాజకీయాల్లో పైకి కనిపించినంతగా నాయకులు ప్రజలకు తెలియాలన్నది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు ఎవరు? అని ప్రజలు నుంచి సమాధానం తెలుసుకోవాలనుకుంటే వారి నుంచి ఏమో? అన్న సమాధానాలే వినిపించాయి. బిజేపి విషయంలో కూడా అదే విధమైన స్పందన కనిపించింది. ఇతర ప్రతిపక్షాల విషయంలో ప్రజలకు కనీసం చాలా మంది నేతల పేర్లు కూడా తెలియకపోవడం విశేషం. రోజూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసే నాయకుల గురించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీస అవగాహన లేదు. అంటే వాళ్లు కూడా జనంలోకి వెళ్లలేదన్నది స్పష్టమౌతోంది. బిఆర్‌ఎస్‌ విషయంలోనే ప్రజలు ఒక సిర్ధనిర్ణయంతో వున్నారన్నది మాత్రం స్పష్టమౌతోంది. కాంగ్రెస్‌,బిజేపిలను కేవలం పట్టణ ప్రాంతాల ప్రజలు ఆదరించేలా కనిపిస్తోంది. అయినా అక్కడ కూడా గెలిచేంతగా ప్రజల్లో వారి స్ధానం కనిపించలేదు. పట్టణ ప్రాంతాలలో చిరు వ్యాపారులనుంచి మొదలుపెద్ద పెద్ద వ్యాపార సంస్ధలకు కూడా కరంటు ఎంతో అవసరం. కాంగ్రెస్‌ వస్తే కరంటు కోతలు మొదలైతే అప్పుడు లబోదిబో అనడం కన్నా, ఇరవై నాలుగు గంటల కరంటు ఇస్తున్న కేసిఆర్‌ను దూరం చేసుకోవడం ఎందుకు? అన్న మాటలే వినిపించాయి. రైతుల సంగతి సరేసరి. వాళ్లు ముఖ్యమంత్రికేసిఆర్‌ తప్ప మరెవరినీ అంగీకరించే పరిస్ధితి లేదు. సాగు విషయంలో, కరంటు విషయంలో , పెన్షన్ల విషయంలో బిఆర్‌ఎస్‌కు తిరుగులేదు. కాని యువతలో కొంత అసహనం మాత్రం కనిపించింది. అది బిఆర్‌ఎస్‌కు కొద్ది పాటి మైనస్‌ కావొచ్చు. అందుకే కొన్ని సీట్లు తగ్గొచ్చు. 2018లో మెజార్టీలలో కోత పడొచ్చు. కాని బిఆర్‌ఎస్‌ విజయానికి ఢోకా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!