ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
శాసనసభ ఎన్నికల్లో మొదటి సారిగా వికలాంగులు, వృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వేసులు బాటు కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఎన్నికల అధికారి సమక్షంలో ఓటేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలోనే వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో వృద్ధులు, నడవలేని వికలాంగులు ఓటు వేయాలంటే వీల్ చేర్స్, ప్రత్యేక వాహనాలు రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వారు నేరుగా ఫారం డి-12 ను సమర్పిస్తే ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బిఎల్ఓ సిఫార్సు చేస్తారు. ఇంటికి వచ్చే ముందు పోలింగ్ సిబ్బంది ఓటర్ కు సమాచారం అందిస్తారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయో వృద్ధులు, వికలాంగులు ఓటును వేస్తారు. అక్కడ నుంచి నేరుగా సిబ్బంది పోలింగ్ బూత్ కు తరలిస్తారు.ఇట్టి కార్యక్రమంలో ఎన్నికల అధికారులు బిఎల్ఓ లు అంజలి లక్ష్మయ్య పోలీసు సిబ్బంది పాల్గొన్నారు