కాంగ్రెస్కు ఓటేస్తే కరువులు..కర్ఫ్యూలే.!

ప్రజల మొహాల్లో ఆనందం కోసమే బిఆర్ఎస్ పని చేస్తుంది

కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు మనకు వస్తాయి

తెలంగాణ రాష్ట్ర రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ ప్రజల మొహాల్లో ఆనందం చూడడానికని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్, మడిపల్లి గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముఖంలో ఆనందం చూస్తుంది అన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు 24 గంటలు కరెంటుతో పాటు రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని, పంట పండిన ప్రతి గింజనుకొంటూ వారం రోజుల్లోపు రైతులే ఎకౌంట్లో డబ్బులు జమ చేసి వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమన్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాలలోపు హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మరోసారి పేద ప్రజల కోసం మేనిఫెస్టో రూపొందించారని, ఈ మేనిఫెస్టో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయన్నారు. మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షల పెంచుతామని అన్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకం తో 5 లక్షల ఉచిత బీమా అందిస్తూ గ్యాస్ సిలిండర్ ని కూడా 400 కి అందించనున్నామని అన్నారు. అలాగే రైతుబంధును కూడా 16 వేలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇకపై అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. మడిపల్లి గ్రామంలో శివాలయం, దుర్గామాత ఆలయం తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతారని అన్నారు. చెల్పూర్ నుంచి మొండికుంట వరకు వరద కాలువ నిర్మాణం కోసం రెండు కోట్ల కేటాయిస్తామన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ లతోపాటు గ్రామ సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు. 

 

బిజెపి నుంచి బిఆర్ఎస్ లో కి 30 మంది యువకులు

 

హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని బిజెపికి చెందిన 30 మంది యువకులు బుధవారం వాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇది గమనించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

 

హుజురాబాద్ మేలి బంగారం మా కౌశిక్ అన్న ఆడియో ఆవిష్కరణ

 

హుజురాబాద్ మేలి బంగారం మా కౌశిక్ అన్న అనే ఆడియో సీడిని బుధవారం పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నిర్మాత ప్రభు ఈ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో తనకంటూ ఒక మార్కు వేసుకున్న కౌశిక్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే తాను ఈ పాటను రూపొందించానని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. హుజురాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే అది కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!