బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డిని గెలిపించాలి

మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కరీం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మొగుళ్లపల్లి మండలంలోని వెలిశాల, పర్లపల్లి, మోట్లపల్లి, వేములపల్లి, బంగ్లా పల్లి, గుడిపాడు, కురిక్షాల, పోతుగల్లు, పిడిసిల్ల, గ్రామాల యందు విస్తృత ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా మైనారిటీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం మాట్లాడుతూ ప్రజాఅభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మండల కేంద్రాలలో వివిధ గ్రామాల్లో ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ వైపే తమ విలువైన ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని దేశం మొత్తంలోనే మైనారిటీల విద్యకు గురించి700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వమే అని ఎస్సీ, ఎస్టీ ,విద్యార్థులతో సమానంగా మైనారిటీ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని, కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంది ,అని కాంగ్రెస్ హయాంలో పదివేల లోపు ర్యాంకు ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్స్ పొందేవారు తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సమానంగా లక్ష ర్యాంకు ఉన్న వారికి కూడా, స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు, మైనారిటీలు అధికంగా నిరుపేదలు ఉండడంతో వివాహాల కోసం షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది యువతుల వివాహాలకు ఒక లక్ష,నుటాపదహారు రూపాయలు అందించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వo,మాత్రమే అని వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా మైనారిటీలను అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి వైపే మీ ఓటు వేయాలని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈనెల జరగబోవు మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొని విజయవంతం చేయవలెనని మరొకసారి రమణారెడ్డి ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ,ఉన్నదని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కోఆప్షన్ అబ్దుల్ రహీం జడ్పీకోఆప్షన్ ,యాకుబ్ మండల్ కోఆప్షన్, మైబుద్దిన్ ముస్లిం సేవా సమితి ప్రెసిడెంట్ ,ఎస్ కే ,సాధిక్ పాషా మండల కోఆప్షన్ ,అఫ్జల్ మండల్ కోఆప్షన్ అబ్దుల్ రహీం జిల్లా యూత్ ప్రెసిడెంట్ అష్రఫ్ అలీ మైనారిటీనాయకులు సాధిక్ , అస్లాం ,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!