నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న పోలంపల్లి విజేందర్ రెడ్డికి స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక గురు స్పందన అవార్డును ఫౌండేషన్ చైర్మన్ సామ్యూల్ రెడ్డి చేతుల మీదుగా శనివారం రోజున ఖమ్మంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని రమాదేవి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాలస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు నిగ్గుల శ్రీదేవి, గ్రామ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నందికొండ సుగుణ, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య, ఎస్ఎంసి చైర్మన్ అమ్మ హారిక శుభాకాంక్షలు తెలియజేశారు.