https://epaper.netidhatri.com/
`సీనియర్లను తరిమి…బడుగులను వంచించి.
`గెలవక ముందే ఎండబెట్టి తొక్కుతా అంటున్న రేవంత్!
`నిలకడలేని తనం.. రేవంత్ రాజకీయం!
`అభివృద్ధి మీద అవగాహన లేదు.
`నాయకులు, రేవంత్ కు మధ్య సమన్వయం లేదు.
`పార్టీకి పని చేసిన వారికి గుర్తింపు లేదు.
`ఇన్నేళ్లు సేవ చేసిన వారికి టిక్కెట్లు లేవు.
`కాపీ కొట్టిన పథకాలు.
`అమలు చేస్తారన్న నమ్మకం లేదు.
`గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు!!
`కనిపిస్తున్నది గాలి కాదు…కాంగ్రెస్ గెలిచేది లేదు.
కాంగ్రెస్‌ను చెల్లా చెదురు చేయడంలో పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సక్సెస్ అయ్యాడు. కాని తాన ఒక్కడినే అందరికన్నా మేధావిని అనుకునేంత స్ధాయికి చేరుకున్నాడు. ఇంత కాలం ఆయనను నమ్మకున్నవారికి కూడా ఆయన కొంత మందికి టిక్కెట్లు ఇవ్వలేదు. అలాంటి వారిలో అద్దంకి దయాకర్ ఒకరు. ఆయనను ఓ వైపు ఎదగోసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించారు. తర్వాత అదే అద్దంకి దయాకర్ చేత క్షమాఫన చెప్పించాడు. ఆఖరుకు దయాకర్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. కాని రాజగోపాల్‌రెడ్డికి టికెట్ ఇప్పించాడు. రెడ్డి రెడ్డి ఒకటే నిరూపించాడు. కాంగ్రెస్‌పార్టీ కోసం ఇంత కాలం పనిచేసిన వారిని కాదని, అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం కండువా కప్పకముందే టిక్కెట్లు ప్రకటించారు. దాంతో నిన్నటిదాకా కాంగ్రెస్ అంటే గుర్తు పట్టిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్‌రెడ్డి మాత్రమే అనే స్దితికి తెచ్చేశాడు. సరిగ్గా ఏడాడి క్రితం అమెరికాలో పర్యటనలో వున్న సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం చేస్తున్నాడు. ఆనాడు రేవంత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్‌అంటే రేవంత్ అని చెప్పాడు. ఆనాడు ఖండిరచిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నేడు నోరు మెదపలేకపోతున్నాడు. కారణం పార్టీ మారిన తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. దాంతో ఆయన కూడా మాట్లాడే పరిస్దితి లేకుండా చేసుకున్నాడు. కాని అసమ్మతి అనేది నివురుగప్పిన నిప్పులా మారింది. తెలంగాణలో రెడ్డి రాజ్యం తీసుకురావాలన్నది రేవంత్ లక్ష్యం. అందుకే ఆయన ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో రెడ్డిలందరికీ కనీసం ఐదు ఎకరాల పొలం వుండేలా వారిని ఉన్నత స్దితి తేవాలని చెప్పాడు. ఇప్పుడు దానిని అనుసరిస్తున్నాడు. తన వర్గాన్ని మొత్తం పార్టీలో నింపుకున్నాడు. ఆయనకు ఎప్పుడూ ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకుండా వుండేందుకు బడుగులను తరిమేశారు. కొందరని పొమ్మనలేక పొగబెట్టాడు. కొందర్ని కావాలనే పక్కనపెట్టేశాడు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడి మీద నోరు పారేసుకున్నాడు. 2014లో 50వేలు, 2018లో 70 వేట ఓట్ల తేడాతో ఓడిపోయిన పొన్నాలకు ఎలా టిక్కెట్లు ఇస్తామని కొత్త బాష్యం చెప్పారు. మరి కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిలో ఎలా టిక్కెట్ తెచ్చుకున్నాడు. పార్టీ ఎలా టికెట్ ఇచ్చింది. అసలు పిసిసి. పదవే రూ.50 కోట్లకు కొనుకున్నాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనాడో చెప్పాడు. రేవంత్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడుగా వున్నంత కాలం గాంధీభవన్‌లో అడుపెట్టనన్నాడు. కాని రెడ్డి రెడ్డి ఎంత కొట్లాడుకున్నా ఒకటే అని నిరూపించుకున్నారు.
తాజాగా రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి.
గత టిక్కెట్లు అమ్ముకున్నాడంటూ వస్తున్న ఆరోపణల మీద మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ టికెట్ అడిగిన వారు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్‌కోసం పోటీ పడుతున్నారు. టిక్కెట్లకోసం ధరఖాస్తు చేసుకొమ్మంటే వెయ్యి మంది చేసుకున్నారు. అంటే నా వల్ల పార్టీకి ఎంత ఊపు వచ్చిందో గమనించాలని సూచిస్తున్నాడు. అంతే కాదు తాను కోవర్టులను ఏరి వేయాలని ఏనాడో చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతుందన్నాడు. కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి దక్కని వాళ్లు బిఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, వాళ్లంతా కోవర్టులంటూ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు చంద్రబాబు కోవర్టే రేవంత్‌రెడ్డి. ఇటీవల జైలులో చంద్రబాబును కలిసిన కాసాని జ్ఞానేశ్వర్ తో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అన్నట్లే లెక్క అన్నాడని చెప్పారు. అంటే కాంగ్రెస్‌ను ఎంత దూరం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నాడో అర్దం చేసుకోవచ్చు. అలాంటి రేవంత్ కాంగ్రెస్‌లో కోవర్టుల గురించి మాట్లాడుతుండం హాస్యాస్పదంగా వుంది. రేవంత్ తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లే అని పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్‌లోనే కొందరు పెద్దలు అంటున్నారు. ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే అన్న రేవంత్‌రెడ్డి ఆశ కాంగ్రెస్‌ను ఖాళీ చేయించే స్దితికి తెచ్చాడు. ఈ మధ్య రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష కూడా వివాదస్పదమౌతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, కేటిఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు కూడా ఆహ్వానించడం లేదు. నిజానికి రేవంత్‌రెడ్డి రాజకీయమే నిలకడలేని తనంతో కూడుకున్నది. రేవంత్‌రెడ్డికి రాజకీయాల మీద అవగాహన లేదు. తెలంగాణ సాగు మీద పట్టు లేదు. ప్రగతి మీద ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలాంటి అవగాహన లేదని, ఆయన గొప్ప పాలన అందించాడని గుర్తు చేస్తున్నాడు. అంటే తాను ప్రతిపక్షంలో వున్నా, అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అని చెప్పకనే చెబుతున్నాడు. ఉద్యమ కారులకు టిక్కెట్లు ఎందుకు ఇవ్వ లేదంటే రేవంత్ రెడ్డి చెబుతున్న భాష్యాలు ఎవరూ సమర్ధించరు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కి లాంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం జరిగిందని సమర్ధించుకోవడం వింతగా వుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వదిలి, ఆ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, రేవంత్‌ను తూర్పార పట్టి, బిజేపిలో చేరి, మళ్లీ యూటర్న్ తీసుకున్నా టికెట్ ఇచ్చారు. అంటే కేవలం అక్కడ ఆయన రెడ్డి అనే టాగ్‌లైన్ తప్ప మరొకటి లేదు. కాని రాజగోపాల్ రెడ్డికి ఉద్యమ కారుల లిస్టులో టికెట్ ఇచ్చినట్లు రేవంత్ చెప్పుకోవడం దుర్మార్గం. గత పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ మీద ఈగ వాలకుండా చూసుకున్న మానవతా రాయ్ లాంటి వారికి టికెట్ ఇవ్వలేదు. ఆయన బిఆర్‌ఎస్‌లో చేరితే కోవర్టు అని అనడం అంటేనే రేవంత్ అహాంకారం కనిపిస్తోంది. మానవతా రాయ్ అనేక కేసులు ఎదుర్కొన్నది కూడా కోవర్టుగానేనా అన్నది రేవంతే సమాధానం చెప్పాలి.
రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు లేరు.
ఓటుకు నోటు కేసు ఆయనకు మెడల్ లాంటిది అని చెప్పడం అంటేనే ఆయన రాజకీయ దివాలుకోరుతనానికి నిదర్శనం. తెలంగాణ కోసం ఏనాడు రేవంత్‌రెడ్డికొట్లాడిరది లేదు. ఒక ఆ సమయంలో తెలుగుదేశం పార్టీయే అదికారంలో వుంటే రేవంత్‌రెడ్డి సమైక్య వాదం వినిపించేవారు. కాకపోతే అప్పుడు ప్రతిపక్షంలో వుండడం, చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి జై సమైక్యాంద్ర అనలేదు. ఏనాడు ఆయన జై తెలంగాణ అనలేదు. కాని ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా టికెట్ ఇప్పించడంలో తాన పాత్ర వుందంటూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయగానే చంద్రబాబు సీమాంద్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తుంటే రేవంత్‌ఆనాడు మాట్లాడిరది లేదు. పైగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని అస్దిరపర్చాలని చూసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాడంటే ఎవరూ నమ్మరు. రేవంత్‌రెడ్డి ఆలోచనలు ఉట్టికి ఎగరేలనమ్మ, ఆకాశానికి ఎగిరినట్లు వుంది. అసలు కాంగ్రెస్ వచ్చే అవకాశమే కనిపించడం లేదు. కాని ఆయన తెలంగాణలో మరో కొత్త నగరం నిర్మాణం చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాలే కాపీ. మొత్తం బిఆర్‌ఎస్ ఫధకాలనే ఆయన కాపీకొట్టారు. ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ ప్రకటించిన పధకాలకు గ్యారెంటీ ఏమిటి? వాటికి వారెంటీ ఎవరిస్తారు? అన్నదానికి కాంగ్రెస్‌లో సమాదానం లేదు. అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు ఎంత వరకు నమ్ముతారన్నది కాలమే నిర్ణయించాలి.