సభ ఏర్పాట్లను పరిశీలించిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభ కు ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ బహిరంగ సభ కోసం సభా స్థలం మరియు హెలిప్యాడ్, పార్కింగ్ మరియు తదితర ఏర్పాట్లును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు..
దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి, ప్రతి పల్లె నుండి సభకు భారీగా తరలి రావాలని
పిలుపునిచ్చారు
బహిరంగ సభ కు వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులకు సూచించారు..