
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ఉదయం ప్రధానోపాధ్యాయులు కే రఘుపతి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అల్పాహార భోజనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రుచికరమైన శుభ్రమైన నాణ్యతతో కూడిన అల్పాహార భోజనాన్ని విద్యార్థు లు చక్కగా వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు సమయానికి క్రమం తప్పకుండా బడికి పంపించాలని ఈ సందర్భంగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీరామ్ రఘుపతి స్కూల్ చైర్మన్ సర్పంచ్ పూర్ణచంద్రరావు మరియు ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, ఉస్మాన్ ,సరళాదేవి .నీలిమారెడ్డి, రామనారాయణ. సదయ్య .సుజాత. విజయలక్ష్మి ,కల్పన, శంకర్, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు .