రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్,మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం వరంగల్, హన్మకొండల్లో విస్త్రతంగా పర్యటించారు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత తదితర ప్రముఖులతో కలిసి వరంగల్, హన్మకొండల్లో శుక్రవారం విస్త్రతంగా పర్యటించారు.వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు,ఖిల్లా వరంగల్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.హన్మకొండ అలంకార్ సెంటరులో 5కోట్ల 55 లక్షలతో మున్నూరుకాపు
భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తం రావు, సంఘం ప్రముఖులు డాక్టర్ హరి రమాదేవి,కటకం పెంటయ్య,గైగేని రాజన్,కనుకుంట్ల రవికుమార్,పెరుకూరి శ్రీధర్, కంభంపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో నిర్మించిన రజక భవనాన్ని కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేశారు.ఖిల్లా వరంగల్ లో జరిగిన బహిరంగసభలో ఎంపీ రవిచంద్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి,సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి హాజరయ్యారు.ఎంపీ రవిచంద్ర, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితర ప్రముఖులను శ్రీహనుమద్గిరి పద్మాక్షి దేవస్థానం వేద పండితులు శాలువాలతో సత్కరించి తమ ఆశీర్వచనాలు పలికారు.కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుంట నగర పోలీసు కమిషనర్ రంగనాథ్ బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షించారు