# నీతి అయోగ్ బ్లాక్ లెవెల్ చింతన్ శివీర్ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండలం ఎంపిక

# విద్యా, వైద్య రంగంలో మన జిల్లా ఎంతో పురోగతి సాధించింది జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీతి అయోగ్ చింతన్ శిబిర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి చింతన్ శిబిర్ ఎంతగానో దోహద పడుతుందని కలెక్టర్ అన్నారు రాబోయే రెండు సంవత్సరాల్లో 100 శాతం కన్నాయిగూడెం మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు) వెంకన్న డి ఆర్ డి ఏ నాగ పద్మజ, డిపిఓ. వెంకయ్య. డి డబ్ల్యుఒ. ప్రేమలత. కన్నాయిగూడెం మండలం ప్రత్యేక అధికారి. వెంకటనారాయణ. ఎంపీడీవో. ఫణి చంద్ర మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *