రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుమారుడు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజు వేడుకలు
నిరాడంబరంగా జరిగాయి.రవిచంద్ర అభిమాని పాల్వంచ రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని నివాసంలో జరిగిన వేడుకల్లో దుకూరి రాజా
చౌదరి,జువ్వాల టింకు,జిల్లపెళ్లి ఉపేందర్ చౌదరి,సరిపాల ముఖేష్ రెడ్డి,మేడ శివాచౌదరి,మిర్యాల విష్ణు,తులసీ రాజానాయుడు తదితరులు నిఖిల్ కు పుష్పగుచ్ఛాలు
అందజేసి,శాలువతో సత్కరించారు,కేక్ కట్ చేయించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఉప్పు సత్యనారాయణ, పులిపాటి దామోదర్ తదితరులు
పాల్గొన్నారు.