50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

 

`కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి…

`ఆగష్టు నుంచే గడపగడపకు…

`బిజేపి దంతా పైన పటారమే…

`గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు…

`పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు…

`రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

`ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే…

`చేతులెత్తేసినట్లే లెక్క…

`బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు.

`బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి.

`టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు.

`తమ మద్దతు తెలియజేస్తున్నారు.

`ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కారు వైపే….

`రైతు బంధు లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే

`అసరా పించన్లు, ఇతర పింఛన్‌ దారులంతా కేసిఆర్‌ నాయకత్వమే కోరుకుంటున్నారు.

`ఫ్లోరైడ్‌ బాధ విముక్తి టిఆర్‌ఎస్‌ తోనే జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయం చెబుతున్నారు.

`టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి రికార్డు సృష్టిస్తుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపు మామూలుగా వుండదు. మెజార్టీ 50వేలు దాటుతుంది. ఎక్కడికెళ్లినా జనం టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభంజనమే కనిపిస్తోంది. ఎన్నికలన్న తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలి కాబట్టి అన్నట్టుగానే వుంది. వారి ప్రచారం. వారికి ప్రజల్లో స్ధానం. బిజేపికి మునుగోడులో చెప్పాలంటే బిజేపికి లీడర్లు లేరు. క్యాడర్‌ అసలే లేదు. అద్దెకొచ్చిన నాయకులు తప్ప వారితో నడిచేందుకు జనమే లేరు. బిజేపి వైపు ప్రజలు చూడడమే లేదు. బిజేపి నాయకులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే తరిమికొడుతున్నరు. ఈ గ్యాస్‌ ధరలేంది…ఈ నిత్యావసర వస్తువుల ధరలేంది? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మోతేంది? అని బిజేపి నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలే బిజేపి నేతలను పరిగెత్తిస్తున్నారు. వారికి మాటలు లేకుండా చేస్తున్నారు. వారికి చెమటలు పెట్టిస్తున్నారు. ధరలు తగ్గించి రండి…అప్పుడు చూద్దాంపో అని మొహంమీదనే బిజేపి నేతలను ప్రజలు చీకొడుతుంటే ఏం చెప్పుకోవాలో? ఎలా చెప్పుకోవాలో తెలియని అయోమయంలో వున్నారు. దాంతో బిజేపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టిన సంగతి చూస్తునే వున్నాం. ఈ విషయం ముందునుంచి మనం చెబుతూనే వున్నాం. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిందంటే చాలు ఏదో ఒక నాటకానికి తెరతీస్తారని తెలుసు. అదే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అనుసరిస్తున్నది. ఇంకా ప్రజలు బిజేపిని నమ్ముతారా? వారికి ఓట్లేస్తారా? అంటున్న మునుగోడు ఉప ఎన్నికల నియోజవకర్గ ఇన్‌ఛార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…మునుగోడు నుంచి.మునుగోడు ప్రజలకు టిఆర్‌ఎస్‌పై ఎంత ప్రేమ, అభిమానం వున్నాయో గ్రామాలు తిరుగుతుంటే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తమకు జరిగిన మేలు ఏమిటో ప్రజలు మాకే వివరిస్తున్నారు. ముఖ్యంగా మిషన్‌ భగీరధ నీళ్ల గురించి చెప్పని వ్యక్తి అంటూ లేడు. ఏ గ్రామనికి వెళ్లినా ఇదే మాట…ఈ రోజు ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా వున్నారంటే కారణం నీళ్లు. ఈ నీళ్లకోసం ఏళ్ల తరబడి గోస పడ్డ ప్రజల కళ్లలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కృతజ్ఞతాభావం కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. కాంట్రాక్టులు తప్ప, నియోజవర్గ అభివృద్ధి తన వల్ల కాదని వదిలేశాడని ప్రజలు అంటున్నారు. ఆయనను శాపనార్దాలు పెడుతున్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఓట్లేస్తే ఏం చేస్తాడు? నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా నాలుగేళ్లు గాలి తిరుగుళ్లు తిరిగి మళ్లా ఎందుకొచ్చాడో మాకు తెలుసంటున్నారు. గత ఎన్నికల్లోనే రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి పొరపాటు చేశామని, ఈ సారి ఆ పొరపాటు చేయకుండా టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు. మునుగోడుకు నేను ఆగష్టులో వచ్చాను. 

అప్పటినుంచి దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలే కాదు, అన్ని గడపలు కూడా టచ్‌చేశాను. ప్రజల చెప్పే ప్రతి మాట విన్నాను. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ కలిశాను. వాళ్లంతా ఓట్లేసేందుకు సిద్ధంగా వున్నారు. అందుకే మేం మెజార్టీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. 50వేల మెజార్టీ వస్తుందన్న ఆలోచనతో వున్నాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు సభతో ఆ జోష్‌ మరింత పెరుగుతుంది. మా మెజార్టీ కనీవినీ ఎరగరి రీతిలో పెరిగే అవకాశం కూడా వుంది. ఎందుకంటే మేం నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులు. భవిష్యత్తులో గిరిజిన బంధు అమలు వంటి పధకాలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి వుంది. కేసిఆర్‌తోనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ రాకపోతే ఇలాంటి పథకాలు చూసేవాళ్లం కాదని అంటున్నారు. ఇక ఆసరా పెన్షన్‌ దారులు మాత్రం తమ ఓటు కేసిఆర్‌కే అంటూ చెప్పడం కూడా మీడియాలో చూస్తున్నదే. మాకు ప్రత్యక్ష అనుభవంతో వింటున్నదే. వాళ్లు కేసిఆర్‌ గురించి చెబుతున్న తీరు కూడా ఎంతో ముచ్చటేస్తుంది. గతంలో తమ జీవన విధానం, ఇప్పటి జీవిన విధానంలో కనిపిస్తున్న మార్పును స్పష్టంగా చెబుతున్నారు. తమ పెద్ద కొడుకు కేసిఆర్‌ అంటున్నారు. బీజేపీ ప్రచారమంతా పైట పటారమే.. ఆ పార్టీకి క్యాడర్‌ లేదు. లీడర్‌ షిప్‌ అసలే లేదు. కాని కాంట్రాక్టర్‌ను చూసి ఇతర ప్రాంతాలను ప్రచారానికి వస్తున్న జనమే గాని, మునుగోడు ప్రజలు బిజేపి సభలు వెళ్లడం లేదు. ప్రచారంలో పాల్గొనడంలేదు. అంతే కాకుండా ఈ మధ్య ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో ఆయన ఆవేశాలకు లోను కావడం. తాను చెప్పింది మాత్రమే జనాన్ని వినాలనడం…తనను ప్రశ్నించొద్దని ప్రజలను భయపెట్టడం కూడా ప్రజల్లో బిజేపిపై మరింత కోపం పెరిగింది. అసలు రాజగోపాల్‌రెడ్డి పరిస్దితి చూసి, ఆ పార్టీ నేతలెవరూ ప్రచారానికి కూడా రావడంలేదు. ఆయన వెంట తిరిగేందుకు ఇష్టపడడం లేదు. ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రజలు చీ కొడుతున్నారు. అసలు రాజీనామా ఎందుకు? చేశావో మాకు తెలుసంటూ మొహం మీదనే రాజగోపాల్‌రెడ్డిని తిడుతుంటే ఆయనకు రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. తన రాజకీయ భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోంది. ఎందుకు రాజీనామా చేశానా? అన్నది తన ముఖ కవలికల్లో తెలిసిపోతుంది. ఇక కాంగ్రెస్‌ పరిస్దితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. పాల్వాయి స్రవంతికి ప్రచారం చేయడానికి కూడా ఎవరూ లేరు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ జోడోయాత్ర జోష్‌లో వుంది. మునుగోడును వదిలేసింది.

ఎలాగూ మునుగోడులో గెలిచేది లేదు. కనీసం డిపాజిట్‌ కూడా వచ్చేది లేదు. టిఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు నిలబడి కొట్లాడే శక్తి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. దాంతో రాహుల్‌ యాత్రలో పాల్గొన్నాకనీసం పేరొస్తుందన్న ఆలోచనలతో నాయకులు వున్నారు. స్రవంతిని ఒంటరిని చేసి వదిలేశారు. నిజానికి బిజేపి, కాంగ్రెస్‌లు ఎప్పుడో చేతులెత్తేశాయి. మునుగోడులో ప్రజల నాడి వారికి అర్ధమైపోయింది. టిఆర్‌ఎస్‌ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే ప్రచారం మానుకున్నారు. వార్‌ వన్‌ సైడ్‌ చూసి పక్కకు తప్పుకున్నారు. ఇదిలా వుంటే మునుగోడు నియోజవర్గం మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తరాల యుద్దం మొదలుపెట్టారు. మునుగోడులో బిజేపిని పాతిపెట్టేందుకు సిద్ధమౌతున్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడిస్తామని శపధం చేస్తున్నారు. పద్మశాలీలంతా చేనేతపై జిఎస్టీ వేయడాన్ని నిరసిస్తూ పోస్టు కార్డు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టరు. ఈ ఉద్యమం ఒక విప్లవంగా సాగుతోంది. మొదట పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ఉత్తరం రాశారు. పార్టీ శ్రేణులతోపాటు, పద్మశాలీలు ప్రధానికి ఉత్తరాలు రాస్తున్నారు. అంటే చేనేత వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఎలా తుంచేయాలని చూస్తుందో జిఎస్టీతో తేటెతెల్లమైంది దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకమైన ఘట్టం. విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తు ఉత్పత్తి, వినియోగం. ఇది దేశమంతా ఒక ఉప్పెనలాంటి విప్లవాన్ని సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అదే చేనేతతో కేంద్ర ప్రభుత్వాన్ని కదలించేందుకు, వచ్చే ఎన్నికల్లో బిజేపి ప్రభుత్వాన్ని దించేందుకు, ఇప్పుడు మునుగోడులో బిజేపిని ఓడిరచి బుద్దిచెప్పేందుకు ఇక్కడినుంచే అడుగులు మొదలయ్యాయి. చేనేత సోదరులు ఉత్తరాలతో బిజేపి పునాదులు కదలనున్నాయి. పేదలపై భారాలు మోపుతూ, చిన్న చిన్న వ్యాపారాలను చిదిమేస్తూ, చేతి వృత్తులను నాశనం చేస్తున్న బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, బిజేపిని ముంచేందుకు మునుగోడులోనే శ్రీకారం జరుగుతుంది. బిజేపిపై గెలిచి మరోసారి టిఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో చూపిస్తాం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *