17వ పోలీస్ బెటాలియన్ లో రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన 17వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం*
రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హీనా, డాక్టర్ రవి బృందం మరియు 17వ పోలీస్ బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది అందరిని ఆయన అభినందించారు. మొత్తం 20 మంది సిబ్బంది రక్తదానం చేశారని తెలియజేశారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు పోలీసులు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శైలజ , ఆర్.ఐ లు శ్రీ పి.నారయణ , డి.శంకర్ , పి.రాజేందర్ , బి.శ్రీధర్.అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు…