ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
హనుమకొండ జిల్లా గీసుగొండ మండలం లోని 18 మంది లబ్దిదారులకు 18,02,088 రూపాయాల కళ్యాణ లక్ష్మి చెక్కులను పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు హనుమకొండలోని అయన నివాసంలో అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… పేద ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా తల్లిదండ్రులు భావిస్తే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలోచనతో ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులు దైర్యంగా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెడుతుంటే… ప్రతిపక్షాలు ఓర్వక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గ్రామాల్లో తిరిగే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలన్నారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ సంక్షేమ పథకాలు ఆమలవుతున్నాయో బిజెపి నాయకులను ప్రశ్నించాలన్నారు. ఇంకా ఇలాంటి గొప్ప పథకాలు ఎన్నో రావాలంటే సీఎం కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.