తెలంగాణలో సంక్షేమ విప్లవం.
ముందే చెప్పిన నేటిధాత్రి….
అందరికంటే ముందే ఈ విషయాన్ని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది
నేటిధాత్రి చెప్పినట్లుగానే కేసిఆర్ ప్రకటించారు.
ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం…
బిజేపికి దిమ్మతిరిగే సమాధానం…
సెస్టెంబర్ 17 కానుకగా గిరిజనులకు మూడు వరాలు ప్రకటించిన కేసిఆర్.
పోడుసాగు చేసుకునే గిరిజనులకు కూడా రైతు బంధు అమలు
తెలంగాణలో పది శాతం వున్న గిరిజనులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు.
దాంతో గిరిజనులకు మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశాలు…
దళిత బంధులాగానే గిరిజన బంధు…
ప్రతి ఇంటికి రూ.10లక్షలు.
త్వరలో కార్యాచరణ ప్రకటన
స్టేజీ మీదే కేసిఆర్ కాళ్లు మొక్కిన మంత్రి సత్యవతి రాధోడ్..
గిరిజన సంఘాల హర్షాతిరేకాలు..
కేసిఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు..
కేసిఆర్ జిందాబాద్ నినాదాలతో మారు మ్రోగిన ఎన్టీఆర్ స్టేడియం…
ఎంత సంతోషంగా కేసిఆర్ సభకు వచ్చారో…అంతకు రెట్టించిన ఆనందంతో తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమైన గిరిజనులు.
తెలంగాణలో మరో కొత్త పధకం అమలు కాబోతోంది. గిరిజన, ఆది వాసీ ప్రజలకు ఒక శుభవార్త అందింది. ముఖ్యమంత్రి కేసిఆర్ మదినుంచి జాలు వారింది. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కేసిఆర్ నోటి నుంచి త్వరలో గిరిజన బంధు అనే పధకం ప్రకటన వెలువడిరది. ఇప్పటికే తెలంగాణలో దళిత బంధు అమలౌతోంది. త్వరలో గిరిజన బంధుకు శ్రీకారం జరగనుంది. ఈ విషయం గత కొద్ది రోజుల ముందే నేటిధాత్రి చెప్పింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల్లో గిరిజన బంధు అమలు ఆలోచన మొదలైందని నేటిధాత్రి చెప్పింది. ఈ ప్రకటన కూడా అతి త్వరలో వెలువడనుందన్న సంగతి కూడా నేటిధాత్రి రాసింది. అన్నట్లుగానే హైదరాబాద్‌లో గిరిజన, ఆది వాసీ, బంజారా భవన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన అశేష జనవాహిని గిరిజన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనం సభలో గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. అంతే కాకుండా ఆ వర్గాలకు మరిన్ని వరాలు కురిపించారు. ఇంత కాలం వున్న పోడు సమస్యలు త్వరలో తీరుతాయన్నారు. అందుకు కమిటీ వేసినట్లు వెల్లడిరచారు. అలాగే పోడు సాగు చేసుకునే గిరిజన రైతులకు ఇక నుంచి రైతుబంధు సాయం కూడా అందిస్తామన్నారు. అలాగే తెలంగాణలో వున్న పది శాతం గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఒకేరోజు గిరిజనులకు మూడు వరాలు కురిపించారు. ఆ వర్గాలకు మరింత మేలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే తండాలను ప్రత్యేక పంచాయతీలు చేశారు. గ్రామ పరిపాలనలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. తండాల అభివృద్దికి మార్గం వేశారు. ఎన్నోఏళ్లుగా అపరిషృతంగా వున్న ఆ సమస్యను తీర్చారు. ఇప్పుడు గిరిజనుల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపే గిరిజనబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన బంధుతో వారి జీవితాలకు దశ, దిశ చూపించనున్నారు. 10శాతం రిజర్వేషన్లతో వారికి మరిన్ని విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు. తెలంగాణలోని రైతులందరికీ అందుతున్నట్లే పోడు సాగు చేసుకునే గిరిజనుందరికీ రైతు బంధు అమలు చేస్తామని చెప్పడంతో గిరిజన వర్గాలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్కసారిగా ఎన్టీఆర్ స్టేడియంలో ఉద్వేగ భరితమైన వాతావరణం నెలకొన్నది. గిరిజన ఆదివాసీల కరకళ ద్వానాలతో సభ మారు మ్రోగిపోయింది. కేసిఆర్ జిందాబాద్ అంటే నినాదాలు మిన్నంటాయి. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ సంతోషాన్ని ఆపుకోలేక ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పాదాభివందనం చేశారు.
ఎన్టీఆర్ మైదానంలో లక్షలాది మంది గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ప్రకటనలు చేసి, వారిని సెప్టెంబర్ 17 కానుకగా అందించారు. తెలంగాణ ఒక సంక్షేమ రాష్ట్రంగా అవతరిస్తోంది. తెలంగాణ ఒక సంక్షేమ జీవనానికి వేధికౌతుంది. అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన ఒక స్వర్ణయుగం కానున్నది. అసలు ఇలాంటి పధకాలు గురించి ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. అమలు చేయలేదు. కనీసం ఊహలకు కూడా అందని పధకాలను కలలో కూడా కలగనలేదు. మార్గదర్శకుడంటే కేసిఆర్‌లా వుండాలి. మార్గ నిర్ధేశకుడు కేసిఆర్ ఆలోచించాలి. సంక్షేమ వాది కేసిఆర్‌లా నిర్ణయాలు తీసుకోవాలి. సంక్షేమ సారధి కేసిఆర్‌లా అమలు చేయాలి. మొత్తంగా ప్రజల సుసంపన్న జీవితాలను కాంక్షించే నేతలు కేసిఆర్‌లా వుండాలి. కేసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కేసిఆర్‌లా పాలించాలి. అప్పుడు దేశం సుభిక్షంగా వుంటుంది. ప్రజలంతా నిత్యం పండగలా గడుపుతారు. ప్రతి రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి సామాజిక వర్గం ఉన్నతంగా జీవిస్తుంది. ఎవరూ ఊహించని దెబ్బ కొట్టడమే కేసిఆర్ రాజకీయ చాణక్యమని మరోసారి నిరూపించారు. సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయం చేయాలనుకున్న బిజేపి ఆశలు ఆవిరిచేశారు. ఇప్పటికే అమలౌతున్న దళిత బంధు మీద రకరకాల కామెంట్లు చేస్తూ, దళిత వర్గాలకు దూరమైన బిజేపిని గిరిజనులకు, ఆదివాసీలకు దూరం చేసే స్కెచ్ కేసిఆర్ వేశారు. అదును చూసి సెప్టెంబర్ 17న ప్రకటించారు. దాంతో ఆయా వర్గాల ఓట్లను గంప గుత్తగా తన ఖాతాలో వేసుకునేందుకు కేసిఆర్ వేసిన ఎత్తు ముందు బిజేపి చిత్తైందనే చెప్పాలి. ఇలాంటి ప్రకటన చేస్తాడని బిజేపి అంచనా వేయలేకపోయింది. అందులోనూ సెప్టెంబర్ 17న కేసిఆర్ గిరిజన బంధు ప్రకటన చేస్తాడని అసలే ఊహించలేకపోయింది. అంతే కాకుండా ఏకంగా మూడు రకాల వరాలు కూడా ఒకే వేధిక మీద నుంచి కేసిఆర్ ప్రకటించాడు. బిజేపిని చిక్కుల్లో పడేశారు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా బిజేపికి మార్గం లేకుండా చేశారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచి అమలు చేస్తాం…అందుకు సహకరిస్తారా? లేదా? అని సవాలు విసిరారు. దాంతో రాష్ట్ర బిజేపి నేతల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నామన్న సంతోషంలో బిజేపి వుంది. కాని ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మారిపోయేలా, బిజేపిని ఉక్కిరి బిక్కిరి చేసేలా కేసిఆర్ వేసిస పథకంతో దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. కేంద్ర హోం మంత్రి రాజకీయం కూడా తుస్సుమన్నది అని చెప్పకతప్పదు. ఇదిలా వుంటే గిరిజనులు, ఆదివాసీలకు రైతు బంధు అమలు చేయడం అన్నది ఒక సంచలన నిర్ణయమని చెప్పకతప్పదు. గిరిజన రిజర్వేషన్లు పెంచుకోవడం అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం. తెలంగాణ ప్రతిపాదనను బిజేపి అంగీకరిస్తుందా? దళిత వర్గాల ముందు దోషిగా నిలబడుతుందా? అన్నది త్వరలో తేలిపోతుంది. దాంతో బిజేపి రాజకీయానికి తెలంగాణలో స్కోప్ లేకుండాపోతుంది. వున్న స్పేస్ కూడా కనుమరుగౌతుంది. బిజేపిలో వున్న గిరిజన, ఆదివాసీ నేతలు కూడా టిఆర్ఎస్ వైపు అడుగులేయక తప్పని పరిస్దితిని కేసిఆర్ సృష్టించారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరిసల్పకుండా చేద్దామనుకున్న బిజేపికి ఊహించని గిఫ్ట్‌ను కేసిఆర్ ఇచ్చినట్లైంది. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకోనని కేసిఆర్ చెబుతూనే వస్తున్నాడు. కాని బిజేపియే పెడ చెవిన పెట్టింది. తమ రాజకీయం ముందు అందరూ దిగదుడుపే అని అనుకున్నది. కాని కేసిఆర్ కొట్టే రాజకీయ కౌకు దెబ్బల రుచి బిజేపికి ఇప్పుడిప్పుడే మొదలైందని తేలిపోయింది.
గిరిజన ఆది వాసీ ఆత్మీయ సమ్మేళనానికి లక్షలాదిగా తరలి వచ్చిన వారినిద్దేశించి కేసిఆర్ మాట్లాడారు. ఒకడు కులం పేరుతో, మరొకడు మతం పేరుతో తెలంగాణలో విద్వేశాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేశాలకు తెలంగాణలో తావివ్వొద్దని సిఎం కేసిఆర్ కోరారు. తెలంగాణ కోసం కులమతాలకతీతంగాం 58 సంవత్సరాలు కొట్లాడాం…తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ 5శాతం వుండేది. తెలంగాణలో వారి జనాభా 10శాతం వుంది. తెలంగాణలో గిరిజనులక 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వుంది. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50శాతానికి మించి లేదని రాసి లేదన్నారు. తమిళనాడులో అమలౌతున్న రిజర్వేషన్ చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆదివాసీ బిల్లును ఆమోదించాలని కోరారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారానికి అవసరమైన కమిటి ఏర్పాటు జరిగింది. అందుకు జివో. నెంబర్140 కూడా జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో గిరిజన సంస్కృతిని కాపాడుకుంటున్నామన్నారు. అచ్చం పేటలో అడవుల్లో వుండే చెంచులతో సహా, ఆదిలాబాద్‌లో వుండే ఆదివాసీలకు కూడా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గిరిజన, ఆదివాసీల పండుగలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్రం కావడం వల్లనే ఇవన్నీ సాద్యమౌతున్నాయని కేసిఆర్ చెప్పారు. అలాగే వచ్చేరోజుల్లో గిరిజన రిజర్వేషన్లు 10శాతం అమలు చేసుకుంటామని కేసిఆర్ వెల్లడిరచారు. సబ్బండ వర్గాలన్నీ కలిసి కొట్లాడిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.