antharjathiya sadasuku doctor rajkumar, అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

దుగ్గొండి మండల ప్రశాంతి మహిళా సమాఖ్య ఏపీఎం డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌ అంతర్జాతీయ యువత సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుండి వచ్చే నెల 1తేదీ వరకు బ్యాంకాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో జరిగే అంతర్జాతీయ యువత సదస్సుకు భారతదేశ ప్రతినిధిగా హాజరవుతున్నట్లు తెలిపారు. యువత నిర్మాణ పాత్ర, యువత రాజకీయం, యువత నాయకత్వ లక్షణాలు, రాబోయే తరాలకు యువత ఇచ్చే సందేశాలు, సామాజిక బాధ్యతలు తదితర అంశాలపై ఈ సదస్సులలో మాట్లాడనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 12దేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఘనత తనకే దక్కిందని గుర్తుచేశారు. బ్యాంకాక్‌ దేశం నుండి 2వ సారి ఆహ్వానం అందిందని, గత 25సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. భారతదేశ ప్రభుత్వం నుండి 4 జాతీయస్థాయి పురస్కారాలు, అలాగే ప్రపంచ దేశాలల్లో 5సార్లు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నట్లు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!