మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు
ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రారంభం చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ఈనెల 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఉత్సవాలు వరంగల్ రూరల్ జిల్లా అటవీశాఖ, జన విజ్ఞాన వేదిక, వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటిరోజున హైదరాబాద్ బర్డింగ్ ఫాల్స్ సొసైటీ బాధ్యులు శ్రీరామ్‌రెడ్డి, గోపాలకష్ణ ఆధ్వర్యంలో పాకాల అభయారణ్యంలో సందర్శించి వివిధరకాల పక్షులను గుర్తించి అందులో నుండి ఇండియన్ పక్షిని ప్రత్యేక పక్షిగా గుర్తించామన్నారు. అలాగే 2వ తేదీన బర్డ్ ఫెస్టివల్, 3వ తేదీన నర్సంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో ఉపన్యాస, పాటల పోటీలు, 4వ తేదీన ఆన్‌లైన్‌లో స్లోగన్స్, కార్టూన్లు, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అటవీ నడక పాకాలలో ఉదయం 6గంటలకు, అలాగే అదేరోజు మొత్తం ప్రకతి శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను జనవిజ్ఞాన వేదిక, వనసేవా సొసైటీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమాలకు పర్యావరణ ప్రేమికులు హాజరై విజయవంతం చేయాలని అటవీశాఖ అధికారి పురుషోత్తం కోరారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ బాధ్యులు శ్యాంసుందర్‌శర్మ, హైదరాబాద్ బర్డింగ్ ఫాల్స్ అధికారిణి అంజుల దేశాయ్, రేంజ్ అధికారి రమేష్, డిప్యూటీ రేంజ్ అధికారి ఇజాజ్ అహ్మద్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సుధాకర్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు.