డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వరంగల్ సికేఎం హాస్పిటల్ ప్రాంతంలో మద్యం సేవించి, మైనర్లు వాహనాలు నడపడం ద్విచక్రవాహనాలకు వివిధరకాల శబ్దాలను చేసే సైలెన్సర్ వాహనాలకు లైసెన్సు ఇంకా ఇతర పత్రాలు లేని వాహనదారులకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసిన వాహనదారులకు చాలాన్ వేసి కేసులు విధించడం జరిగిందని వరంగల్ ట్రాఫిక్ సిఐ టి.స్వామి తెలిపారు. ఇప్పటి వరకు 23వేల రూపాయలు జరిమానా విధించామన్నారు. ఇరుకుగా ఉండి ప్రధానంగా సికేఎం హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చి వెళ్లే గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వరంగల్ పోస్ట్ ఆఫీస్ నుండి హాస్పిటల్ వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో పూల దుకాణాలు, ఇంకా వివిధ రకాల వ్యాపారస్తులు రోడ్లపై వస్తువులు ఉంచడం వల్ల వాహనదారులకు ఇబ్బంది అవుతుందని, అందులో మద్యం సేవించి, మైనర్లు ఇంకా త్రిబుల్ రైడింగ్ నివారించటానికి తనికీలు చేపట్టామని చెప్పారు. ఈ తనికీల్లో వరంగల్ ట్రాఫిక్ ఎస్సైలు, ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.